BigTV English
Advertisement

Murari Movie: మురారి మూవీకి మహేశ్ బాబునే ఎందుకు సెలక్ట్ చేశారంటే.!

Murari Movie: మురారి మూవీకి మహేశ్ బాబునే ఎందుకు సెలక్ట్ చేశారంటే.!

Why Did You Select The Director Mahesh Babu For Murari Movie: టాలీవుడ్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే తన నటనతో టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా నిలిచిపోయాడు. ఇక 23 ఏళ్ల కిందట మహేశ్ యాక్ట్ చేసిన మూవీ మురారి. ఈ మూవీ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి మహేశ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. 2001 ఏడాదిలో వచ్చిన ఈ మూవీ 23 ఏళ్ల తర్వాత 4కే వర్షన్‌లో రీ రిలీజ్ అయింది. రీ రిలీజ్‌లో 3 రోజుల్లో ఏకంగా రూ 8 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంతకుముందున్న రీ రిలీజ్ తెలుగు సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. అంతేకాదు ఈ మూవీ ఆడుతున్న థియేటర్లలో లవర్స్ పెళ్లిళ్లు చేసుకుంటున్న వీడియోలు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


ఇక మహేశ్‌ బాబు రాజకుమారుడు మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మూవీతో డిజాస్టర్‌ని ఎదుర్కొన్నాడు. వరుస ఫ్లాపులతో ఉన్న మహేష్‌కి సూపర్ హిట్ ఇచ్చి, నటుడిగా ఓ స్థాయికి చేర్చింది ఈ మూవీ. ఈ మూవీలో మహేష్ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.ఈ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటుగా అమ్మాయిలకు మహేష్‌ని కలల రాకుమారుడిగా చేరువ చేసింది.అలాంటి మూవీని ఓ హీరో రిజెక్ట్ చేశాడంటే నమ్మగలరా.. అవునండి బాబు ఇది ముమ్మాటికి నిజం. జేడీ చక్రవర్తితో తీసిన గులాబీ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణవంశీ నాగ్‌తో నిన్నే పెళ్లాడతా సినిమా చేసి బిగ్గెస్ట్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. 1996లోనే ఏకంగా ఇరవై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది నిన్నే పెళ్లాడతా. ఈ మూవీ తర్వాత వరుసగా సింధూరం చంద్రలేఖ అంతఃపురం సముద్రం వంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన కృష్ణవంశీ, మహాభారతం నుంచి మురారి కథను రాసుకున్నాడు. అయితే ఇదిలా ఉంటే హీరో నాగార్జున అయితేనే మురారి రోల్‌కి బాగా సెట్ అవుతాడని అనుకున్నాడట కృష్ణవంశీ. అయితే ఒక్క ఏడాదిలో ఏకంగా 8 సినిమాలు చేశాడు కింగ్ నాగార్జున. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నువ్వు వస్తావని నిన్నే ప్రేమిస్తా ఆజాద్ వంటి హిట్లతో దూసుకుపోతూ, బిజీ షెడ్యూల్ మధ్య కృష్ణవంశీ మూవీకి డేట్స్ ఇవ్వలేక నో చెప్పేశాడట నాగార్జున.

Also Read: ఎమర్జెన్సీ ట్రైలర్‌లో పవర్‌పుల్‌ వుమెన్‌గా కంగనా రనౌత్..


అప్పటికే హీరోగా పరిచయమైన నాగార్జున మేనల్లుడు సుమంత్‌తో మురారి తీయాలని కృష్ణవంశీని కోరాడట. అయితే కాస్త రఫ్ లుక్‌లో ఉన్న సుమంత్‌కి సాఫ్ట్ రోల్ మురారి అసలు సెట్ కాదని అనుకున్నాడట కృష్ణవంశీ. అప్పటికే రాఘవేంద్ర రావు సుమంత్‌ని హీరోగా పెట్టి పెళ్లి సందడి టైపులో తీయాలని చూసిన పెళ్లి సంబంధం భారీ డిజాస్టర్‌గా నిలవడంతో ససేమిరా అన్నాడట డైరెక్టర్ కృష్ణవంశీ. అయితే డైరెక్టర్ టాలెంట్‌ని గుర్తించిన సూపర్ స్టార్ కృష్ణ తన కొడుకు మహేష్ బాబుతో మూవీ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడట. అంతేకాదు ఓ పార్టీలో మహేష్‌ని నేరుగా చూసి మంత్ర ముగ్ధుడయ్యాడట కృష్ణవంశీ. అలా మురారి మూవీ క్యారెక్టర్‌కి మహేష్ అయితేనే కరెక్టని అనుకొని మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లి బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకోవడం అన్ని చకచకా అయిపోయాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×