BigTV English

Virat Kohli: ఈ రోజు.. ఆ రోజే.. కోహ్లీ స్ఫూర్తిదాయక ప్రసంగం

Virat Kohli: ఈ రోజు.. ఆ రోజే.. కోహ్లీ స్ఫూర్తిదాయక ప్రసంగం

Virat Kohli’s ‘Eng must Feel Hell’ Speech before Lord’s Win (sports news today): అది 2021వ సంవత్సరం
ఆగస్టు 16..
అంటే సరిగ్గా ఇదే రోజు..
క్రికెట్ ఆటకు పుట్టిల్లుగా పిలిచే లార్డ్స్ మైదానం
ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య 2వ టెస్ట్ మ్యాచ్ చివరి రోజు.. నరాలు తెగే ఉత్కంఠ.
విరాట్ కొహ్లీ కెప్టెన్..
టెస్టు చరిత్రలో అద్భుత మ్యాచ్ గా నిలిచి..
టీమ్ ఇండియా చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకున్న
ఆ రోజు.. ఈ రోజే.. ఆగస్టు 16..
ఈ మ్యాచ్ జరిగి ఇప్పటికి మూడేళ్లు అవుతోంది.
ఇప్పటికి ఆ మ్యాచ్ ని ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. ఎందుకంటే ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఈ గెలుపు వెనుక కెప్టెన్ విరాట్ కొహ్లీ టీమ్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు.. నేడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


ఒకసారి మ్యాచ్ విషయానికి వస్తే..
2021 సంవత్సరంలో ఆగస్టు 12-16 మధ్య జరిగిన మ్యాచ్..
ఇండియా రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 364, 298 /8 (డిక్లేర్డ్) పరుగులు చేసింది.
అయితే, ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 391 పరుగులు చేసింది.
ఇక చివరి రోజు ఆట మిగిలింది.
ఇంగ్లండ్  గెలవాలంటే 272 పరుగులు చేయాలి.
ఇంకా 60 ఓవర్లు ఉన్నాయి.
ఇంగ్లండ్ కి ఓటమి తప్పదని తెలిసిపోయింది. దీంతో మ్యాచ్ ని డ్రా చేయడానికి శతవిధాలా ప్రయత్నించింది. ఓవర్ డిఫెన్స్ ఆడింది. అలా 51.5 ఓవర్ల వరకు సాగదీసింది. అయినా సరే, టీమ్ ఇండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఘన విజయాన్ని అందించారు.

నిజానికి ఇంగ్లండ్ వన్డే మ్యాచ్ తరహాలో ఆడితే, అలవోకగా గెలుస్తుంది. 60 ఓవర్లు, 272 పరుగులు మాత్రమే ఉన్నాయి. అయితే విరాట్ కొహ్లీ చాలా రిస్క్ తీసుకుని ముందురోజు డిక్లేర్ చేశాడు. అప్పటికే విరాట్ పై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి, డ్రాగా ముగించాల్సిన మ్యాచ్ ను.. డిక్లేర్ చేసి తప్పు చేశాడని పెద్ద రచ్చ మొదలైంది.


తీవ్ర ఉత్కంఠ మధ్య చివరి రోజు మ్యాచ్ మొదలైంది. అంతకు ముందు టీమ్ ని ఉద్దేశించి విరాట్ కొహ్లీ మాట్లాడిన మాటలు జట్టులో స్ఫూర్తిని నింపాయి. ఇంతకీ తనేమన్నాడంటే.. మన జట్టులో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా లాంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారు.  ఓటమి అనే మాట పక్కన పెట్టండి. నా ద్రష్టిలో అది లేదు. ఇంగ్లండ్ ని 60 ఓవర్ల లోపు ఆలౌట్ చేయగలమనే కాన్ఫిడెన్స్ తోనే ముందడుగు వేద్దాం.

గెలుపు-ఓటములు అనేవి మనచేతుల్లో లేదు. కానీ గెలవడానికి ఎన్ని మార్గాలున్నాయో, మన వద్ద ఎన్ని అస్త్రాలున్నాయో అన్నీ ప్రయోగిద్దాం.. చివరి వరకు ప్రయత్నిద్దాం.. అని అన్నాడు. నిజానికి  కెప్టెన్ ఎంతో ఆత్మ విశ్వాసంతో కనిపించేసరికి జట్టులో ఒక నూతన చైతన్యం వచ్చింది. మొత్తానికి మ్యాచ్ స్టార్టయ్యింది.

Also Read: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోకి రిషబ్ పంత్‌ ఎంట్రీ

మొదటి ఓవర్ బుమ్రా వేశాడు. ఒక వికెట్ వచ్చింది. రెండో ఓవర్ షమీ వేశాడు. మరో వికెట్ వచ్చింది. ఓపెనర్లు ఇద్దరూ డక్ అవుట్లు అయ్యారు. అంతే టీమ్ ఇండియాలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. అదే పట్టుతో ఇంగ్లండ్ ని బిగించేశారు. అష్ట దిగ్భందం చేసేశారు. మొత్తానికి ఇంగ్లండు నలుగురు ఆటగాళ్లను పరుగులేమీ చేయకుండానే మన బౌలర్లు డక్ అవుట్ చేశారు.

మహ్మద్ సిరాజ్  4, బుమ్రా 3, షమీ 1, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీశారు. మొత్తానికి ఇంగ్లండ్ ను 120 పరుగులకి ఆలౌట్ చేశారు. 60 ఓవర్లు డిఫెన్స్ ఆడి, మ్యాచ్ ని డ్రా చేద్దామని ఇంగ్లండ్ శతవిధాలా ప్రయత్నించింది. మన బౌలర్లు మిసైల్ లాంటి బాల్స్ వేసి ప్రత్యర్థులను హడలు గొట్టారు. మొత్తానికి టీమ్ ఇండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన విజయంగా నమోదైంది.

మ్యాచ్ అనంతరం విరాట్ కొహ్లీ మాట్లాడుతూ మా బౌలర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని అన్నడు. చివర్లో ఇంగ్లండ్ ఆటగాడు ఆలీ రాబిన్సన్‌ను స్లెడ్జ్ చేశాడని, అయినా సరే, ఎక్కడ కూడా సహనం కోల్పోలేదని కోహ్లీ చెప్పాడు. మా నమ్మకమే మమ్మల్ని గెలిపించిందని సంతోషంతో చెప్పాడు.

Related News

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Big Stories

×