BigTV English

Ravi Kishan: చిక్కుల్లో రేసు గుర్రం విలన్.. 15 ఏళ్ల కూతురుతో మీడియా ముందుకు రెండో భార్య..?

Ravi Kishan: చిక్కుల్లో రేసు గుర్రం విలన్.. 15 ఏళ్ల కూతురుతో మీడియా ముందుకు రెండో భార్య..?

MP Ravi Kishan news today(Tollywood celebrity news): మద్దాల శివారెడ్డి గుర్తున్నాడా.. ? అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం సినిమాలో రవికిషన్ ఆ పాత్రలో నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఈ సినిమాతో అతని రేసుగుర్రం విలన్ అనే ట్యాగ్ లైన్ కూడా వచ్చేసింది. రేసుగుర్రం తరువాత తెలుగులో ఎన్నో మంచి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ భోజ్ పురి నటుడు ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ ఎంపీగా రవికిషన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.


ఇక త్వరలోనే లోక సభ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో రవికిషన్ చిక్కుల్లో పడ్డాడు. ఒక మహిళ.. రవికిషన్ తన భర్త అని మీడియా ముందుకు రావడం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా 15 ఏళ్ల కూతురును వెంటపెట్టుకొచ్చి తన తండ్రితో తన బిడ్డను కలపమని మీడియా ముందు కంటతడి పెట్టడం సెన్సేషన్ గా మారింది. రవికిషన్ కు ప్రీతి కిషన్ అనే భార్య ఉంది. వీరికి రివా కిషన్ అనే కూతురు కూడా ఉంది. అయితే రివా కాకుండా రవికిషన్ కు మరో కూతురు ఉందని, అతను అపర్ణా ఠాకూర్ అనే మహిళను పెళ్లి చేసుకొని సీక్రెట్ కాపురం పెట్టాడని తెలుస్తోంది. అపర్ణా ఠాకూర్ మాట్లాడుతూ.. ” రవికిషన్ నా భర్త. 1996 లో మా వివాహం జరిగింది. మాకు ఒక పాప కూడా ఉంది. ఇప్పటికీ ఆయన మాతో టచ్ లోనే ఉంటారు” అని ఆమె చెప్పుకొచ్చింది.

ఇక అపర్ణా ఠాకూర్ కూతురు మాట్లాడుతూ.. ” 15 ఏళ్లుగా మా నాన్న రవికిషన్ అని తెలియదు. నేను ఆయనను అంకుల్ అనే పిలుస్తాను. నా ప్రతి పుట్టినరోజుకు ఆయన మా ఇంటికి వస్తారు.. ఒకసారి నేను వాళ్ల కుటుంబాన్ని కూడా కలిశాను. ఈ మధ్యనే ఆయన నా తండ్రి అని తెలిసింది. తండ్రి ప్రేమకు నేను చిన్నతనం నుంచి దూరమయ్యాను. ఇప్పుడు నాకు తండ్రి ప్రేమ కావాలి. అందుకే కోర్టులో కేసు వేద్దామనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో కూడా ప్రకంపనలు పుట్టిస్తోంది. మరి ఈ ఆరోపణలపై రవికిషన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×