Big Stories

Article 370 OTT Release Date: ఓటీటీకి వచ్చేసిన కాంట్రవర్సల్‌ చిత్రం ‘ఆర్టికల్‌ 370’.. ఎందులో అంటే..?

Article 370 Available in Netflix from April 19: పుల్వామా దాడి జరిగిన తర్వాత జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగిస్తూ ఇండియన్ గవర్నమెంట్ ‘ఆర్టికల్ 370’ను రద్దు చేసింది. దీంతో ఈ నిర్ణయానికి వ్యతిరేఖంగా జమ్మూకశ్మీర్‌లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అయితే ఆ సమయంలో అక్కడ చోటుచోసుకున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఆర్టికల్ 370’.

- Advertisement -

ఈ మూవీలో యామీ గౌతమ్.. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జూనీ హక్సర్ పాత్రలో నటించి మెప్పించింది. ప్రముఖ దర్శకుడు ఆదిత్య సుహాస్ జంభలే తెరకెక్కించాడు. ‘రామాయణ్’ ఫేమ్ అరుణ్ గోవిల్.. ఈ మూవీలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కనిపించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఎన్నో వివాదాలతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

- Advertisement -

Also Read: యామీ గౌతమ్ ‘ఆర్టికల్ 370’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

అయితే రిలీజ్ అనంతరం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. కానీ ఓ వర్గం నుంచి మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఈ మూవీపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఆ టైంలో ఈ సినిమాను దేశవ్యాప్తంగా ఆపాలంటూ వ్యతిరేకత మొదలైంది. ఎందుకంటే ఈ మూవీలో కేవలం ఒక వర్గాన్ని మాత్రమే అణచివేతకు గురైనట్లు చూపించారని కొందరు తీవ్ర విమర్శలు చేశారు.

అంతేకాకుండా ఈ మూవీపై అరబ్ దేశాల సైతం బ్యాన్ విధించాయి. కానీ ఈ మూవీపై ఎన్ని విమర్శలు, వివాదాలు ఎదురైనా కలెక్షన్లలో మాత్రం ఈ మూవీ తన హవా కనబరిచింది. భారీ కలెక్షన్లను నమోదు చేసింది. అయితే అంతగా వివాదాలతో సంచలనంగా మారిన ఈ సినిమా ఇప్పుడు థియేట్రికల్ రన్ అనంతరం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

Also Read: Vijayendra prasad: ఆ రెండు క్రేజీ సీక్వెల్స్‌కు స్క్రిప్టులు రెడీ.. యమ స్పీడు మీదున్న విజయేంద్ర ప్రసాద్

ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో అనుకున్న టైం ప్రకారం.. ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ రోజు (ఏప్రిల్ 19) నుంచి ‘ఆర్టికల్ 370’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఎప్పట్నుంచో ఈ చిత్రాన్ని చూడాలని అనుకుంటున్న వారు ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అరుణ్ గోవిల్, కిరణ్ కర్మాకర్, వైభవ్ తత్వవాడి, స్కంద్ సంజీవ్ ఠాకూర్‌లు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News