E-Paper
Advertisement

Article 370 Day 1 Collections: యామీ గౌతమ్ ‘ఆర్టికల్ 370’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Article 370 Day 1 Collections: యామీ గౌతమ్ ‘ఆర్టికల్ 370’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Advertisement

Article 370 Day 1 Collections: బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆర్టికల్ 370’ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్లలోకి వచ్చింది. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు రాజకీయంగా ఆరోపించిన అంశాల చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది.

Advertisement

ఇందులో యామీ గౌతమ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించారు. ఆమెతో పాటు ఈ మూవీలో ప్రియమణి, అరుణ్ గోవిల్, కిరణ్ కర్మాకర్ వంటి నటీ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకొని కలెక్షన్లలో దూకుడు ప్రదర్శిస్తోంది.

మొదటి షో నుంచే మంచి టాక్ అందుకున్న ఈ సినిమాకి పోటీగా మరో సినిమా కూడా బరిలో నిలిచింది. విద్యుత్ జమ్‌వాల్ నటించిన యాక్షన్ మూవీ ‘క్రాక్’తో ఈ మూవీ తలపడింది. ఇక ఈ రెండు చిత్రాల కలెక్షన్స్ చూస్తే..

Advertisement

READ MORE: గుడ్‌‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ భామ.. త్వరలో తల్లి కాబోతున్నానంటూ ప్రకటన!

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం, అవినీతి నేపథ్యంలో తెరకెక్కిన ఆర్టికల్ 370 మూవీ మొదటి రోజు రూ.5.75 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇందులో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో నటించిన యామీ గౌతమ్ తన నటనతో అందరినీ కట్టిపడేసింది. ఆమె యాక్టింగ్, డైలాగ్ డెలివరీ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి.

టీజర్, ట్రైలర్స్‌తోనే భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ సినిమాతో అందరి అంచనాలను చేరుకుంది. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌ బట్టి మరికొన్ని రోజుల్లో భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ సినిమాతో పోటీలో ఉన్న ‘క్రాక్’ మూవీ కూడా ఫస్ట్ డే మంచి వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు ఈ సినిమా రూ.4 కోట్లు వసూళు చేసినట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×