E-Paper
Advertisement

Vijayendra Prasads’ Sequel Stories: ఆ రెండు క్రేజీ సీక్వెల్స్‌కు స్క్రిప్టులు రెడీ.. యమ స్పీడు మీదున్న విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasads’ Sequel Stories: ఆ రెండు క్రేజీ సీక్వెల్స్‌కు స్క్రిప్టులు రెడీ.. యమ స్పీడు మీదున్న విజయేంద్ర ప్రసాద్
Advertisement

Vijayendra Prasad Ready for Sequel Story’s: దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి ప్రముఖ రైటర్, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడు తన కలంతో ఎన్నో గొప్ప గొప్ప కథల్ని రాశారు. అంతేకాదు అతడు రాసిన కథలకు నేషనల్ వైడ్‌గా కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే బాహుబలి ముందు వరకు ఓ రకమైన క్రేజ్ ఉండేది. కానీ బాహుబలి తర్వాత అతడి రేంజ్ మరింత స్థాయికి చేరుకుంది.

దీంతో అతడికి డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా.. బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘భజరంగీ భాయీజాన్’ మూవీతో బాలీవుడ్‌లో రైటర్‌గా ఎనలేని క్రేజ్‌ని అందుకున్నాడు. అయితే రైటర్‌గా దూసుకుపోతున్న విజయేంద్ర ప్రసాద్.. దర్శకుడిగా మాత్రం ఎదగలేకపోయాడు.

Advertisement

అతడు దర్శకత్వం వహించిన రాజన్న మంచి హిట్ అయింది. అయితే ఆ తర్వాత చేసిన శ్రీవల్లి బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో అతడు దర్శకత్వానికి గుడ్ బాయ్ చెప్పి రైటింగ్‌పై ఫోకస్ పెట్టాడు. తన సమయాన్నంతా ఇప్పుడు రైటింగ్ పైనే పెడుతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు మహేశ్ బాబు – రాజమౌళి కాంబో ‘SSMB 29’ స్క్రిప్ట్‌ను కంప్లీట్ చేశాడు.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉంది. త్వరలో ఈ మూవీ పట్టాలెక్కబోతుంది. అయితే ఈ స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత విజయేంద్ర ప్రసాద్ మరికొన్ని స్క్రిప్ట్‌లను కూడా కంప్లీట్ చేసేశాడు. అందులో రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ మూవీకి సీక్వెల్ స్క్రిప్ట్‌ కూడా ఒకటి. ఈ మూవీ సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు విజయేంద్ర ప్రసాద్ ఎప్పట్నుంచో చాలా ఆసక్తిగా ఉండే వాడు. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ స్క్రిప్ట్‌ను కంప్లీట్ చేసేశాడు.

Advertisement

Also Read: మహేష్ కు జక్కన్నతో టైం ట్రావెల్ తప్పదా..? అన్ని ఏళ్లు పడుతుందా?

అయితే ఈ సీక్వెల్ మూవీకి రాజమౌళి దర్శకత్వం వహిస్తాడా? లేక మరి ఇంకెవరైనా దర్శకత్వం బాధ్యతలు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ రాజమౌళి దర్శకత్వం బాధ్యతలు తీసుకోకపోతే రవితేజ చేయడు.. అలా అని రవితేజ కాకుండా మరే ఇతర హీరో చేసినా.. ప్రేక్షకులు ఆదరించరు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

అయితే ఈ మూవీ స్క్రిప్ట్‌తో పాటు విజయేంద్ర ప్రసాద్ మరో బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ స్క్రిప్ట్‌ను కూడా కంప్లీట్ చేశాడు. అదే ‘భజరంగీ భాయీజాన్’ సీక్వెల్ స్క్రిప్ట్. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించి అదరగొట్టేశాడు. అయితే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌ స్క్రిప్ట్‌ను విజయేంద్ర ప్రసాద్ కంప్లీట్ చేశాడు.

అయితే ఈ స్టోరీ సల్మాన్‌కు చెప్పడమే మిగిలి ఉందని అంటున్నారు. సల్మాన్ ఖాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కథను ఓకే చేసేస్తాడని గుస గుసలు వినిపిస్తున్నాయి. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×