BigTV English

Yash : ఎట్టేకేల‌కు య‌ష్ 19 ఫిక్స్… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే!

Yash : ఎట్టేకేల‌కు య‌ష్ 19 ఫిక్స్… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే!
Yash

Yash : KGF సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ రికార్డుల‌ను కొల్ల‌గొట్టి అంద‌రి దృష్టిని ఆకర్షించిన హీరో య‌ష్‌. KGF పార్ట్ 1తో బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌ను కొల్ల‌గొట్టిన య‌ష్‌.. గ‌త ఏడాది ఏప్రిల్‌లో విడుద‌లైన KGF 2తో నెంబ‌ర్ వ‌న్ హీరోగా అవ‌త‌రించాడు. అప్ప‌టి నుంచి య‌ష్ త‌దుప‌రి సినిమా ఏంట‌నే దానిపై ప‌లు ర‌కాల వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతూ వ‌స్తున్నాయి. ఫ‌లానా ద‌ర్శ‌కుడితో య‌ష్ సినిమా ఉంటుంద‌ని సోష‌ల్ మీడియాలో న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతూ వ‌చ్చాయి. కానీ య‌ష్ నుంచి అత‌ని టీమ్ త‌ర‌పు నుంచి ఎక్క‌డా య‌ష్ త‌దుప‌రి సినిమా ఎంట‌నే దానిపై అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు.


Yash నెక్ట్స్ సినిమాను ట్రాక్ ఎక్కించ‌టానికి ఇంత స‌మ‌యం ఎందుకు తీసుకుంటున్నార‌నే దానిపై అంద‌రూ తెగ ఆలోచించారు. అయితే య‌ష్ ఇంత స‌మ‌యం తీసుకోవ‌టానికి కార‌ణం.. KGF సినిమా అనే చెప్పాలి. అందుకు కారణం.. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో వ‌చ్చిన క్రేజ్‌ను ఆయ‌న అంత ఈజీగా తీసుకోకూడ‌ద‌నుకోవ‌టమే ఈ ఆల‌స్యానికి కార‌ణం. అయితే తాజా స‌మాచారం మేర‌కు య‌ష్ త‌న 19 మూవీకి సంబంధించి ఓ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

మీడియా స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ మేర‌కు.. య‌ష్ 19 సినిమాను స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో చేయ‌బోతున్నార‌ట‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌లో ఈ సినిమా రూపొంద‌నుంది. అయితే ప్ర‌స్తుతం శంక‌ర్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒక‌టి రామ్ చ‌ర‌ణ్‌తో గేమ్ చేంజ‌ర్ మూవీ. మ‌రో సినిమా క‌మ‌ల్ హాస‌న్‌తో చేసే ఇండియ‌న్ 2. ఈ రెండు సినిమాలు జూన్ కంతా పూర్త‌వుతుంది. సో ఆలోపు అంటే ఏప్రిల్ రెండో వారంలో య‌ష్‌, శంక‌ర్ కాంబో మూవీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌స్తుంది. త‌ర్వాత ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌పై Yash అండ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మ‌రి.


for more updates follow this :BIGTV

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×