E-Paper
Advertisement

Yatra 2 Song : చూడు నాన్న .. నీడ లేని నేనా వీళ్ళ ధీమా..! ‘యాత్ర 2’ సాంగ్ రిలీజ్..

Yatra 2 Song : చూడు నాన్న .. నీడ లేని నేనా వీళ్ళ ధీమా..! ‘యాత్ర 2’ సాంగ్ రిలీజ్..
Advertisement
Telugu cinema news

Yatra 2 Song update(Telugu cinema news) :

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ సినిమా 2019 లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్ గా యాత్ర 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్ మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

Advertisement

ఈ సినిమా వైఎస్ జగన్ పాత్రలో హీరో జీవా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా యాత్ర 2 సినిమా నుంచి “చూడు నాన్న .. నీడ లేని నేనా వీళ్ళ ధీమా” అంటూ సాగే ఓ ఎమోషనల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇందులో వైఎస్సార్ మరణం తర్వాత జగన్ ప్రజలను కలవడం , ప్రజలు జగన్ కి ఆప్యాయంగా స్వాగతం పలకడం, వారి బాధలు చప్పుకోవడం, వారికి వైఎస్సార్ చేసిన మంచి చెప్పడం వంటివి చూపించారు.

చివర్లో దేవుడు అనేది నమ్మకం, వైఎస్సార్ అనేది నిజం అంటూ ఎమోషనల్ డైలాగ్ చెప్పించారు. ప్రస్తుతం ఈపాట వైరల్ గా మారింది. వైఎస్సార్ అభిమానులు పాటని ఎంతగానో అభినందిస్తున్నారు. ఇక జగన్ పాత్రలో జీవా నటించాడు అనే కంటే జీవించాడు అనే చెప్పాలి . ఎమోషనల్ సీన్స్ ను అద్భుతంగా చేసాడు జీవా ఒక పాటలోనే ఈ రేంజ్ లో ఉందంటే .. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఎన్ని వుంటాయో అనుకుంటున్నారు ఆడియన్స్ . ఇక యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×