BigTV English

Rashmika : రణబీర్‌ను చెంపపై కొట్టా.. యానిమల్ సెట్‌లో ఏడ్చేశా ..

Rashmika :  రణబీర్‌ను చెంపపై కొట్టా.. యానిమల్ సెట్‌లో ఏడ్చేశా ..
Rashmika mandanna latest news

Rashmika mandanna latest news(Latest tollywood news and gossips):


యానిమల్‌ మూవీతో విజయాన్ని అందుకున్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ షూటింగ్‌ అనుభవాలను పంచుకుంది. తన తదుపరి సినిమాలు పుష్ప 2, ధనుష్‌ ప్రాజెక్ట్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.రణ్‌బీర్‌ కపూర్‌తో యానిమల్ సినిమాలో నటించడం తనకు సంతోషాన్నిచ్చిందని తెలిపింది.

డైరక్టర్ సందీప్‌ ఆలోచనా విధానం చూసి తాను ఆశ్చర్యయానికి గురైయ్యానని పేర్కొంది. మూవీలో రణ్‌బీర్‌ను కొట్టే సన్నివేశం నటిగా తనకు సవాల్ గా నిలిచిందని తెలిపింది. ఆ సన్నివేశాన్ని ఒక్క టేక్‌లోనే షూట్‌ చేశామని వెల్లడించింది. సందీప్ ఆ సన్నివేశం కోసం చెప్పాగానే ఆశ్చర్యయానికి గురైయ్యానని తెలిపింది. సందీప్ అదే పరిస్థితిని ఫీలవ్వాలని చెప్పారనన్నారు. సన్నివేశంలో నటించేటప్పుడు ఆయన చెప్పిన ఆ ఒక్క మాటే తనకు గుర్తుందని పేర్కొంది.


యాక్షన్‌, కట్‌ మధ్యలో ఏం జరిగిందో గుర్తు లేదని తెలిపింది. సీన్‌లో నటిస్తూ రణ్‌బీర్‌ మీద పెద్దగా కేకలు వేశానని సీన్ సన్నివేశ క్షణాలను గుర్తు చేసుకుంది. కోపంతో అతడిని చెంపపై కొట్టానని షాట్‌ ఓకే అని డైరక్టర్ చెప్పినా తన కన్నీళ్లు ఆగలేదని వెల్లడించింది. సన్నివేశం తర్వాత బాగా కన్నీటిపర్యంతం అయ్యానని తెలిపింది. తర్వాత రణ్‌బీర్‌ వద్దకువెళ్లి అంతా ఓకేనా అని అడిగానని తెలిపింది. యానిమల్‌ సీక్వెల్‌ విషయంలో డైరక్టర్ సందీప్‌ ఎంతో క్లారిటీతో ఉన్నారని పేర్కొంది. యానిమల్ పార్ట్-1 విజయం సాధించిందని, సందీప్ అనుకున్న విధంగానే పార్ట్ ని స్క్రీన్ ప్లే లో చూపిస్తారని తెలిపింది.

పుష్ప-2 సినిమా అభిమానులు ఊహించిన దానికంటే భారీ స్థాయిలో నిర్మిస్తున్నామని రష్మిక ప్రకటించింది. పుష్ప పార్ట్ వన్ హిట్ అవ్వడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని వెల్లడించింది. ఇటీవలే తాను ఒక పాట షూట్‌లో పాల్గొన్నానని ప్రకటించింది. ఈ సినిమా ముగింపు లేని కథ అని పేర్కొంది. సినిమా విషయంలో తనపై ఎటువంటి ఒత్తిడి లేదని ప్రకటించింది. పార్ట్ వన్ కన్నా తన పాత్ర పార్ట్ 2 లో మరింత మెరుగ్గా ఉంటుందని తెలిపింది. శేఖర్ కమ్ముల డైరక్షన్‌లో హీరో ధనుష్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు రష్మిక వెల్లడించింది.

Tags

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×