BigTV English
Advertisement

Under-19 World Cup 2024 : ఈసారి ఎవరు మెరుస్తారు? నేటి నుంచే అండర్ 19 వన్డే ప్రపంచ కప్..

Under-19 World Cup 2024 : ఈసారి ఎవరు మెరుస్తారు? నేటి నుంచే అండర్ 19 వన్డే ప్రపంచ కప్..

Under-19 World Cup 2024 : దక్షిణాఫ్రికాలో అండర్ 19 వన్డే ప్రపంచకప్ నకు రంగం సిద్ధమైంది. ఇది నిజంగా శ్రీలంకలో జరగాల్సింది. కానీ అప్పుడు ఐసీసీకి ఆగ్రహం వచ్చి వేదికను సౌతాఫ్రికాకు మార్చేసింది. ఈ క్రమంలోనే కుర్రాళ్ల వన్డే ప్రపంచకప్ నేటి నుంచి ప్రారంభం కానుంది.


2000 సంవత్సరంలో యువరాజ్ అండర్ 19 ఆడే వెలుగులోకి వచ్చాడు. రోహిత్ శర్మ (2006), విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా (2008), రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ (2016), శుభ్ మన్ గిల్ (2018) లను అందించిన అండర్ 19 ప్రపంచ కప్ నుంచి , మరి నేడు ఎవరు వెలుగులోకి రానున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ నుంచి అండర్ 19కు ఎంపికైన అరవెల్లి అవనీశ్ రావ్, మురుగన్ అభిషేక్ లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టోర్నీలో భారత్ 2000, 2008, 2012, 2018, 2022 లో విజేతగా నిలిచింది. భారత్ విజయంలో నాడు 2000 లో యువరాజ్ కీలకపాత్ర పోషిస్తే, 2008లో పంత్, కిషన్ జోడీ సంచలనం సృష్టించింది.  2018లో గిల్ ప్రధాన పాత్ర పోషించాడు. 2012 కప్ గెలిచిన టీమ్ లో హనుమ విహారి ఉన్నాడు. 2022 విజయం సాధించినా జాతీయ జట్టుకి ఎవరూ రాలేకపోయారు.


మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్ లుగా విభజించారు. ఇందులో ప్రతి గ్రూప్ లో మొదటి మూడు స్థానాల్లో ఉన్న మూడేసి జట్లు రెండో రౌండ్ కి వస్తాయి.అలా సూపర్ సిక్స్ కి అర్హత సాధిస్తాయి.  అలా 12 జట్లను రెండు గ్రూప్ లుగా  విడదీస్తారు. ప్రతీ గ్రూప్ లో ఆరు జట్లు ఉంటాయి. అలా ఇక్కడ మళ్లీ అదే గ్రూప్ నుంచి మ్యాచ్ లు నిర్వహిస్తారు.అలా చివరికి రెండు గ్రూప్ ల నుంచి తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీస్ కు వెళతాయి. తర్వాత ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

గ్రూప్ -ఏలో : భారత్ ఉంది. ఇంకా బంగ్లాదేశ్, అమెరికా, ఐర్లాండ్ ఉన్నాయి.
గ్రూప్ బీలో : ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్
గ్రూప్ సీలో : నమీబియా, ఆస్ట్రేలియా, జింబాబ్వే, శ్రీలంక
గ్రూప్ డీలో : పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, నేపాల్, న్యూజిలాండ్

Related News

Gambhir-Shubman Gill: గిల్‌కు క్లాస్ పీకిన కోచ్ గంభీర్..నీకు సోకులు ఎక్కువ, మ్యాట‌ర్ త‌క్కువే అంటూ !

PM MODI: వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ ట‌చ్ చేయ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్..ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏం చేశారంటే ?

IND VS AUS, 4th T20: నేడే 4వ టీ20..టీమిండియాకు అగ్ని ప‌రీక్షే..గిల్ వేటు, రంగంలోకి డేంజ‌ర్ ప్లేయ‌ర్ !

RCB ON SALE: అమ్ముడుపోయిన RCB, WPL జ‌ట్లు.. మార్చి నుంచే కొత్త ఓన‌ర్ చేతిలో !

Indian Womens Team: ప్ర‌ధాని మోడీకి వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌ల స్పెష‌ల్ గిఫ్ట్‌..”న‌మో” అంటూ

IND VS SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌..ష‌మీకి నిరాశే, పంత్ రీ ఎంట్రీ, టీమిండియా జ‌ట్టు ఇదే

Bowling Action: ముత్త‌య్య, భ‌జ్జీ, వార్న్‌, కుంబ్లే అంద‌రినీ క‌లిపేసి బౌలింగ్‌.. ఇంత‌కీ ఎవ‌డ్రా వీడు!

WI vs NZ 1st T20i: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్

Big Stories

×