Big Stories

Google Mass Layoffs: గూగుల్ షాకింగ్ నిర్ణయం.. మరోసారి ఉద్యోగుల తొలగింపు.. ఈ సారి ఏకంగా 200 మంది!

Google Layoffs 200 People at a Time: టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పైథాన్ టీమ్ మొత్తాన్ని కాస్ట్ కట్టింగ్ పేరుతో ఎత్తేసిన గూగుల్ తాజాగా మరో 200 మందిని తొలగించింది. అయితే 200 మందిపై వేటు వేసిన గూగుల్ వారంతా కోర్ టీమ్ లో సభ్యులని తెలిపింది. గత నెల 25 కు ముందే వారందరిని తొలగించినట్లు వెల్లడించింది. వారిలో కాలిఫోర్నియా, సన్నీవేల్ ఆఫీసుల్లో పనిచేసిన ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపింది.

- Advertisement -

అమెరికా వెలుపల ఉద్యోగులు తక్కువ జీతానికి పనిచేయడానికి ముందుకు రావడంతో ఈ పొజిషన్లను భారత్, మెక్సికోకు బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పైథాన్, డార్ట్, ఫ్లుట్టర్ లపై పని చేసే బృందాల్లోని చాలా మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది. అయితే వారిని కంపెనీలోని ఇతర విభాగాల్లో ఉద్యోగాలకు అఫ్లై చేసుకోవాలని సూచించినట్లు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.

- Advertisement -

Also Read: బిఎమ్‌డబ్ల్యూ నుంచి రంగులు మార్చే కారు.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ టెక్ కంపెనీల్లో ఉద్యోగలపై వేటు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ టెక్ సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 70 వేలకు పైగా ఉంది. ఉద్యోగులను తొలగించిన సంస్థల్లో టెక్ దిగ్గజాలైన అమెజాన్, గూగుల్, యాపిల్, టెస్లా మొదలైన సంస్థలు ఉన్నాయి. ఇప్పటికే ఎలాన్ మస్క్ కు చెందిన కార్ల తయారీ సంస్థ టెస్లా వేలాది ఉద్యోగులపై వేటు వేసింది. అమ్మకాలు తగ్గడంతోనే ఖర్చులను అదుపులో ఉంచేందుకు ప్రపంచ వ్యాప్తంగా  ఈ సంస్ద ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News