E-Paper
Advertisement

Naa Anvesh: రాజకీయాలలోకి ప్రపంచయాత్రికుడు నా అన్వేష్…ఆ ప్రాంతం నుంచి పోటీ అంటూ!

Naa Anvesh: రాజకీయాలలోకి ప్రపంచయాత్రికుడు నా అన్వేష్…ఆ ప్రాంతం నుంచి పోటీ అంటూ!
Advertisement

Naa Anvesh: నా అన్వేష్ పరిచయం అవసరం లేని పేరు. యూట్యూబ్ ప్రారంభించి వివిధ దేశాలు తిరుగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అన్వేష్(Anvesh) ఇటీవల కాలంలో తన సోషల్ మీడియా వేదికగా ఈయన చేసే వీడియోలు వివాదాస్పదంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా పలు వివాదాలలో నిలుస్తున్న అన్వేష్ రాజకీయాలలోకి వస్తే బాగుంటుంది అంటూ అభిమానులు తనని కోరుతున్నారని ఈయన తాజాగా రాజకీయాలలోకి రావడం గురించి ఒక వీడియో చేశారు. ఇందులో భాగంగా తన రాజకీయ ప్రస్థానం గురించి అన్వేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

వైజాగ్ నుంచి నా అన్వేష్ పోటీ..

ఈ సందర్భంగా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియోని షేర్ చేస్తూ.. అందరూ నన్ను రాజకీయాలలోకి రమ్మని కోరుతున్నారు అయితే నేను ఇండియాకి వచ్చిన వెంటనే ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి వైజాగ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. అభిమానులు తనని రాజకీయాలలోకి రమ్మని చెప్పడానికి కారణం లేకపోలేదు నేను 130 దేశాలు తిరిగాను. అలాగే సాటిలైట్ ను కొండేర్రి పప్పును చేశాను అందుకే రాజకీయాలలోకి రమ్మని కోరుతున్నారని తెలిపారు. అదేవిధంగా రాజకీయాలకు వచ్చిన తర్వాత తాను ఏం చేస్తాను అనే విషయాలను కూడా ఈ సందర్భంగా అన్వేష్ తెలిపారు.

అభిమానులకు బిర్యానీ ఐఫోన్లు..

Advertisement

తాను ఇండియా రాగానే ఫాన్స్ తో మీటప్ పెడతానని తెలిపారు. ఇలా వచ్చిన వారందరికీ ఐఫోన్లు, బిర్యానీ పెట్టిస్తానని అయితే ఈ బిర్యానీలో తాను అమెజాన్ అడవుల నుంచి తీసుకొచ్చిన కాలకూట విషం అందులో కలిపేస్తానని అప్పుడు వాళ్ళు చచ్చిపోతే ఒక కొత్త రాజకీయం మొదలు పెడతానని తెలిపారు. అయితే ఇదంతా ప్రతిపక్షం చేసిందని సింపతి రాజకీయాలు మొదలుపెట్టి ఎమ్మెల్యే అవుతానని ఆ తర్వాత ఎన్నికలలో తాను డిప్యూటీ సీఎం కావడం కోసం తన తల్లికి గులాబ్ జామ్ అంటే ఇష్టం అందులో కాలకూట విషం కలిపి తనని చంపి సింపతితో డిప్యూటీ సీఎం అవుతానని తెలిపారు.

?igsh=MXN4cmF6NHJvYmRuNw==

Advertisement

ఇక ఎన్నికలు వచ్చేనాటికి ప్రజల సమస్యలను తీర్చి సీఎం పదవి కోసం ప్రయత్నాలు చేస్తానని అప్పుడు మా నాన్నకు ఎంత ఇష్టమైన బూంది లడ్డూలో కాలకూట విషం కలిపి చంపి ఆ సింపతీతో సీఎం అవుతానని చెప్పారు. సీఎం అయిన తర్వాత ఎవరిని చంపను బాగా సంపాదించుకుంటానని అన్వేష్ తెలిపారు అయితే నేను ఈ తెలివినంతటిని చాణిక్య నీతి కౌటిల్యుని అర్థశాస్త్రం నుంచి నేర్చుకున్నాననీ, నేను చెప్పిన ఈ విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి నేను రాజకీయాలలోకి రావాలా? వద్దా? అంటూ అన్వేష్ ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయనే విషయాల గురించి ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇక అన్వేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు. సూపర్ గా చెప్పారు అంటూ కొంతమంది స్పందించగా మరి కొంతమంది మీరు ఎమ్మెల్యే కావడం గ్యారెంటీ అంటూ అన్వేష్ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.

Also Read: Tamannaah Bhatia: తమన్నాకి ముద్దు పెట్టిన అభిమాని…షాక్ లో ఫాన్స్ అసలేం జరిగిందంటే?

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

Advertisement
×