Attack on president Convoy: ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఆయా ప్రభుత్వాలపై నిరసనలు ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పటికే పలు దేశాల్లో చూశాం.. చూస్తున్నాం కూడా. తాజాగా అధ్యక్షుడి కాన్వాయ్‌పైనే దాడి చేశారు నిరసనకారులు. కాకపోతే ఆ దేశాధినేత క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగుర్ని అరెస్టు చేశారు. అసలేం జరిగింది? ఎక్కడ అనే విషయాల్లోకి వెళ్తే..
ఈక్వెడార్ అధ్యక్షుడు కాన్వాయ్‌పై దాడి
ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవా కెనార్ కాన్వాయ్‌పై 500 మందికి పైగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన సేఫ్‌గా బయటపడ్డారు. కాకపోతే ఆయన ప్రయాణించిక కారు బాగానే డ్యామేజ్ అయ్యింది. నిరసనకారులు అద్యక్షుడి కాన్వాయ్‌పై రాళ్లు రువ్వడంతో క్షణాల వ్యవధిలో బయటపడ్డారు. అధ్యక్షుడి కారు బాగానే దెబ్బతింది. కారుపై బుల్లెట్లు పేల్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులందరిపై ఉగ్రవాదం, హత్యకు కుట్ర అభియోగాలు మోపినట్టు అధ్యక్షుడి కార్యాలయం తెలిపింది. నేషనల్ ఇండిజినస్ సిటిజన్స్ యూనియన్ నిర్వహించిన నిరసన సందర్భంగా అధ్యక్షుడు నోబోవాపై దాడి జరిగింది. ఆ యూనియన్ గడిచిన రెండు వారాలుగా నిరసనలు చేస్తోంది. డీజిల్ సబ్సిడీని ప్రభుత్వం తగ్గించడాన్ని నిరసనకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
వివాదాస్పద సబ్సిడీ సంస్కరణ?
ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వల్ల చిన్నస్థాయి రైతులు, ప్రజలు ఎక్కువగా ప్రభావితమవుతారని చెబుతున్నారు నిరసనకారులు. యూనియన్ నిర్వహించిన నిరసన నేపథ్యంలో అధ్యక్షుడు నోబోవా కాన్వాయ్‌పై దాడి చేశారు. దాడి ఘటన జరిగిన ప్రాంతానికి 77 కిలోమీటర్ల దూరంలో అధ్యక్షుడు డేనియల్ నోబోవా ఓ విద్యార్థి కార్యక్రమంలో పాల్గొన్నారు. హింసకు పాల్పడవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తనపై జరిగిన దాడి గురించి నోరు విప్పిన ఆయన, ఈక్వెడార్‌లో ఇటువంటి సంఘటనలను సహించబోమన్నారు. అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన వీడియో ఫుటేజీలో కాన్వాయ్‌పై రాళ్లు విసరడం, కారు కిటికీలు పగుళ్లు కనిపించాయి. పగిలిన కారు గ్లాసు, దెబ్బతిన్న విండ్ స్క్రీన్‌తో కూడిన వాహనం కనిపించింది. అధ్యక్షుడు నోబోవా రాక కోసం గుమిగూడిన నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరుని సైనిక చర్యగా వర్ణించింది ఆదేశ జాతీయ స్వదేశీ సమాఖ్య.
ALSO READ: వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
అధ్యక్షుడు నోబోవా రాక కోసం గుమిగూడిన నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరుని సైనిక చర్యగా వర్ణించింది ఆదేశ జాతీయ స్వదేశీ సమాఖ్య. సాంప్రదాయ దుస్తులు ధరించిన స్వదేశీ మహిళను అధికారులు తీసుకెళ్లినట్లు తెలిపింది. డీజిల్ సబ్సిడీలను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ CONAIE రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది.
Equador: Presidente de direita sofre ataque a tiros
Daniel Noboa, presidente do Equador, escapou de uma tentativa de assassinato. Ele foi alvo de um ataque a tiros contra o veículo em que viajava nesta terça-feira, confirmou a ministra do Meio Ambiente e Energia, Inés Manzano. pic.twitter.com/n49MavKvKM
— Fernanda Salles (@reportersalles) October 7, 2025
🇪🇨 Convoy carrying Ecuadorian president attacked during protests #Ecuador
The unrest, now in its eighth day, turned deadly at the weekend. It began after the government said it would end a subsidy on diesel to reduce public spending, curb fuel smuggling and free up funds for… pic.twitter.com/FkN7hir6tE
— News.Az (@news_az) September 30, 2025