Keerthy Suresh: కీర్తి సురేష్(Keerthy Suresh) సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రముఖ నటి మేనక, దర్శకుడు సురేష్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ తాజాగా జగపతిబాబు (Jagapthi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammuraa) కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జగపతిబాబుతో కలిసి ఎన్నో సరదా విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇప్పటివరకు హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ నెగిటివ్ పాత్రలు(Negative Role) వస్తే నటించడానికి సిద్ధమేనా అంటూ జగపతిబాబు ప్రశ్నించడంతో తాను నెగిటివ్ పాత్రలలో కూడా నటించడానికి సిద్ధమేనని తెలియజేశారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో జెంటిల్మెన్ అనే ట్యాగ్ ఇవ్వాల్సి వస్తే ఏ హీరోకి ఇస్తావు అంటూ ప్రశ్నించడంతో క్షణం కూడా ఆలోచించకుండా జగపతిబాబు అంటూ సమాధానం ఇచ్చారు.
ఈ విధంగా కీర్తి సురేష్ జగపతిబాబు పేరు చెప్పడంతో వెంటనే జగపతిబాబు అందరికీ నేను బిస్కెట్లు వేస్తుంటే నువ్వు మాత్రం నాకు దోస వేస్తున్నావు అంటూ సరదాగా ఆట పట్టించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా గడుపుతున్నారు. ఈమె దాదాపు 15 సంవత్సరాల ప్రేమ తరువాత ఆంటోనీ తట్టిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ఈమె చివరిగా దసరా సినిమాలో హీరోయిన్ గా వెండితెరపై సందడి చేశారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో కనిపించారు. ఇక ఇటీవల ఉప్పు కప్పురంబు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల కావడం విశేషం. త్వరలోనే మరో టాలీవుడ్ సినిమా షూటింగ్ పనులలో కీర్తి సురేష్ బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల దిల్ రాజు నిర్మాణంలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రౌడీ జనార్ధన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపిక అయినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికగా వెల్లడించనున్నారు.
Also Read: Kantara Chapter1: మూడు నిమిషాల సీన్ కోసం 4 రోజులు షూటింగ్.. డెడికేషన్ కు హాట్సాఫ్ !