Nobel Prize Winners: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల పేర్ల ప్రకటన షురూ అయ్యింది. 2025 ఏడాదికి గానూ వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. మేరీ ఈ బ్రన్కో, షిమన్ సకగుచిలకు, రామ్స్ డెల్ లకు నోబెల్ పురస్కారం దక్కినట్టు స్వీడన్ లోని స్టాక్ హోంలో నోబెల్ బృందం ప్రకటించింది. రోగ నిరోధక శక్తికి సంబంధించిన పరిశోధనలకు గానూ గుర్తింపుగా వీరికి నోబెల్ బహుమతి వరించినట్టు నోబెల్ బృందం తెలిపింది.
"ఈ ఏడాది వైద్య శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం" #NobelPrize #nobelprize2025 #Medicine #MaryEBrunkow #FredRamsdell #ShimonSakaguchi pic.twitter.com/0DHLmBN42j
— BIG TV Cinema (@BigtvCinema) October 6, 2025
విజేతల పేర్ల ప్రకటన ప్రక్రియ అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది. వైద్య రంగం, భౌతిక శాస్త్రం, సాహిత్యం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, శాంతి తదితర విభాగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఈ నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తారు. ఈ వారం రోజుల్లో అన్ని రంగాలల్లో నోబెల్ బహుమతి వరించిన వారి పేర్లను ప్రకటించనున్నారు.
ALSO READ: RRB NTPC: రైల్వేలో 8850 ఎన్టీపీసీ పోస్టులు.. ఈ జాబ్ వస్తే గోల్డెన్ లైఫ్.. ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు