BigTV English

Neauralink brain chip: వావ్..! మైండ్ చిప్‌తో వీడియో గేమ్.. కంప్యూటర్‌నే కంట్రోల్ చేశాడు

Neauralink brain chip: వావ్..! మైండ్ చిప్‌తో వీడియో గేమ్.. కంప్యూటర్‌నే కంట్రోల్ చేశాడు
neauralink brain chip
neauralink brain chip

Neauralink brain chip: టెక్నాలజీ అందుబాటులోకి రావడం ఏమో కానీ కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని నడిపించేస్తున్నారు. సోషల్ మీడియా ఉంటే చాలు ఏదైనా చేసేయోచ్చని భావిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా వినూత్న ప్రయత్నాలతో సరికొత్త వస్తువులను కూడా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంవత్సరాల క్రితమే రోబోలను సృష్టించిన శాస్త్రవేత్తలు.. తాజాగా టెక్నాలజీ(ఏఐ)ని ఉపయోగించి ఇప్పటికే మనుషుల్లాగే ఉండే ఆర్టిఫిషియల్ రోబోలను క్రియేట్ చేసి మానవుడి చేతి పనిని తగ్గిస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రముఖ వ్యాపారవేత్తలు ప్రపంచాన్ని పాలించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ప్రపంచ కుబేరుడు, బిలియనీర్, టెస్లా అధినేత, ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ ఇప్పటికే మైండ్ చిప్‌ని పరిచయం చేసిన విషయం తెలిసిందే.


మానవుడి మొదడులోని ఆలోచనలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటారు. కంప్యూటర్ల కంటే వెయ్యింతల పని సామర్థ్యం మానవుడి మెదడుకి ఉంటుందని చెబుతుంటారు. తాజాగా మానవుడి మెదడు పనితీరుని తెలుసుకునేందుకు ఎలన్ మస్క్ మైండ్ చిప్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మైండ్ చిప్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో ప్రపంచానికి పరిచయం చేశారు. మైండ్ చిప్ ఏ విధంగా పని చేస్తుందో ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

లైవ్ స్ట్రీమ్‌లో మైండ్ చిప్‌తో అర్బాగ్ అనే వ్యక్తి కంప్యూటర్‌ను ఆపరేట్ చేసినట్లు మస్క్​కు చెందిన న్యూరాలింక్‌ సంస్థ వెల్లడించింది. అర్బాగ్‌కు చిప్‌ను అమర్చి కంప్యూటర్ ఆపరేట్ చేయించినట్లు పేర్కొంది. పెరాలసిస్‌తో బాధపడుతున్న అర్బాగ్‌తో ఎక్స్‌లోని లైవ్ స్ట్రీమ్‌లో గేమ్ ఆడించింది. ‘సివిలైజేషన్‌ వీఐ’ అనే చెస్ గేమ్‌ను అర్బాగ్ మైండ్‌కు చిప్‌ను అమర్చి ఆడించింది. దీనికి సంబంధించిన వీడియోను మస్క్ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశాడు. అయితే ఈ వీడియోలో అర్బాగ్ చెస్ ఆడుతూ మాట్లాడారు. మస్క్ కనుగొన్న మైండ్ చిప్ తో తాను చేయలేను అనుకున్న పనులను చేసినందుకు ఆనందం వ్యక్తం చేశాడు.


అర్బాగ్ 8 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదం కారణంగా అర్బాగ్ వెన్నుముక మెడ కింద నుంచి మొత్తం చచ్చుబడిపోయింది. దీంతో పక్షవతం బారిన పడిన అర్బాగ్ కాళ్లు, చేతులు ఆడించలేని పరిస్థితిలో ఎనిమిదేళ్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే న్యూరాలింక్ చిప్ ద్వారా తన జీవితంలో అనుకోని పని చేసినట్లుగా హర్షం వ్యక్తం చేశారు. తన లైఫ్ లో తాను గేమ్ ఆడుతానని అసలు ఊహించలేదని అన్నారు. కేవలం ఇది మస్క్ న్యూరాలజీ సంస్థ కనుగొన్న మైండ్ చిప్ వల్లే సాధ్యమైందన్నారు. ఈ టెక్నాలజీ చాలా మందికి ఉపయోగపడుతుందని, ఇందులోను మరిన్ని మార్పులు రావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం మైండ్ చిప్ తో తాను గంటల సమయం వీడియో గేమ్స్ కోసం కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×