EPAPER

Nurse: నర్సు నిర్వాకం: ఇక చాలన్న ప్రియుడు.. అయినా వదలకుండా బెడ్రూమ్‌లోకి వెళ్లి మరీ..

Nurse: నర్సు నిర్వాకం: ఇక చాలన్న ప్రియుడు.. అయినా వదలకుండా బెడ్రూమ్‌లోకి వెళ్లి మరీ..

Nurse: 30, 54.. 965, 1000.. ఇదేంటి వరుసగా ఈ నెంబర్లు రాశారేంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇప్పుడు మీరు చదవబోయే ఈ వార్త వీటి చుట్టే తిరుగుతుంది. ఈ నెంబర్లు ఈ వార్తలో అత్యంత కీలకంగా మారాయి. ప్రియుడు – ప్రియురాలు మధ్య సాగిన చాటుమాటుప్రేమ, ఆ తరువాత వారు విడిపోయినంక జరిగిన సంఘటనల్లో ఈ నెంబర్ల ప్రస్తావన ఎదురవుతది. ఈ సంఘటన అగ్రరాజ్యమైన అమెరికాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశం వార్తల్లో నిలిచింది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే..


ఓ నర్సు – వైద్యుడు.. వారిద్దరి మధ్య వయసు వ్యత్యాసం చాలా ఉంది. ఎంతంటే 20 ఏళ్లకు పైగానే ఉంది. అయినా వారి మధ్య ప్రేమ చిగురించింది. అనుకోకుండా చిగురించిన ఆ ప్రేమ.. మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత అసలు సినిమా స్టార్ట్ అయ్యింది. ప్రియుడికి చుక్కలు చూపించింది ప్రియురాలు. ఆ వేధింపులను తట్టుకోలేక అతడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఆ కేసు కోర్టుకు వరకు వెళ్లింది. తనని అంతా వేధించినా కూడా ఆ ప్రియుడు ఆమెపై జాలి చూపించాడు. ఆమెపై దయ చూపాలని జడ్జిని కోరాడు.

Also Read: ఏకధాటిగా 104 రోజులు పనిచేసిన ఉద్యోగి.. చివరికి ఆస్పత్రిలో..


ఎక్కడో కాదు.. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పెన్సిల్వేనియాలోని ఎక్స్‌టన్ అనే ప్రాంతంలో 30 ఏళ్ల వయసు ఉన్న ఓ నర్సు తన కంటే పెద్దవాడైన ఓ దంతవైద్యుడు( 54 ఏళ్లు)ని ప్రేమించింది. ఆ నర్సు అతడి వద్దే పని చేసేది. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ పుట్టింది. దీంతో వీరిద్దరూ కొన్నాళ్లపాటు తెగ ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ, ఏమైందోఏమో గానీ.. ఆ వైద్యుడు ఆ నర్సుకు బ్రేకప్ చెప్పాడు. ఈ ప్రేమ ఇక చాలు వద్దు.. విడిపోదాం అంటూ ఆమెకు దూరమయ్యాడు. ఆ తరువాత ఆ వైద్యుడికి అసలు టార్చర్ స్టార్ట్ అయ్యింది. అతడిని ఆ నర్సు తీవ్ర వేధింపులకు గురి చేసింది.

ఆ వైద్యుడు ఎక్కడికి వెళ్లినా ఆ నర్సు వేటాడుతూనే వచ్చింది. అతడు ఏం చేస్తున్నాడు.. ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకునేందుకు.. ఏకంగా కారులో ట్రాకింగ్ పరికరాన్ని అతనికే తెలియకుండా ఏర్పాటు చేసి అతడిపై నిఘా పెట్టింది. ఒకరోజు ఇది గమనించిన ఆ వైద్యుడు ఆ నర్సును మందలించి కారులోంచి ఆ పరికరాన్ని తొలగించి, దానిని ఆమెకు తిరిగి అప్పగించాడు. అయినా కూడా ఆమె ఆ వైద్యుడిని వేధిస్తూనే వచ్చింది. కొద్దిరోజులకు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆ వైద్యుడి ఇంటి బెడ్రూమ్‌లోకి చొరబడి అతడి ఫోన్‌ను లాక్కొనేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసింది. కానీ, అతడు ప్రతిఘటించాడు. దీంతో ఆమె కిటికీలోంచి దూకి అక్కడి నుంచి పారిపోయింది.

Also Read: రేప్ చేయాలని చూస్తే చచ్చారే.. మృగాళ్ల పనిపట్టే సరికొత్త కండోమ్, ఐడియా బాగుంది మేడం!

ఆ తరువాత కూడా అతడిని వదల్లేదు. ఈసారి ఫోన్ల రూపంలో అతడిని వేధించసాగింది. రోజూ ఎక్కువ సార్లు ఫోన్లు చేసి వేధించింది. ఒక్క రోజు ఏకంగా 965 కాల్స్, మరొక రోజు 1000కి పైగా కాల్స్ చేసి వేధించింది ఆ నర్సు. దీంతో ఆ నర్సు టార్చర్‌ను తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఆ వైద్యుడు మాట్లాడుతూ.. 2021లో తన భార్య చనిపోవడంతో ఆ నర్సుకు దగ్గరైనట్లు కోర్టుకు వెల్లడించాడంటా. అయితే, ఆమెతో ఈ ప్రేమప్రయాణం కొన్నాళ్లవరకు బాగానే సాగినా.. రాను రాను ఆమెను భరించలేనంతగా తనని వేధిస్తున్నదంటూ ఆ ప్రియుడు ఆవేదన వ్యక్తం చేశాడంటా. ఇంత జరిగినా ఆ వైద్యుడు తన ప్రియురాలిపై జాలినే చూపిస్తూ… ఆమెపై దయచూపాలంటూ జడ్జికి విన్నవించుకున్నాడంటా. తాను ఆమెను మార్చేందుకు ప్రయత్నించానని, కానీ.. అది సాధ్యం కాదని ఆమె వేధింపులతో అర్థమైపోయిందంటూ చెప్పుకొచ్చాడంటా.

ఇదిలా ఉంటే.. ఆమె గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 20 వారాలపాటు జైలు శిక్షను కూడా అనుభవించిందంటూ ఆ వార్తల్లో పేర్కొన్నారు.

Related News

Woman Lands Plane: గాల్లో విమానం..పైలట్ భర్తకు గుండెపోటు.. భార్య ఏం చేసిందంటే?.

Nepal Teen Climbs Mountains: ప్రపంచంలోని అన్ని ఎత్తైన పర్వాతాలు అధిరోహించిన టీనేజర్.. కేవలం 18 ఏళ్లకే రికార్డ్!

Omar Bin Laden: లాడెన్ కొడుకుకు దేశ బహిష్కరణ విధించిన ఫ్రాన్స్, అసలు ఏం జరిగిందంటే?

TikTok: ‘టిక్ టాక్’‌కు ఇక మూడింది, పిల్లలను అలా చేస్తోందంటూ అమెరికా మండిపాటు.. బ్యాన్ చేస్తారా?

Hurricane Milton: : హరికేన్ మిల్టన్.. అంతరిక్షం నుంచి అరుదైన వీడియో, దీన్ని చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే!

Netanyahu Warns Lebanon: ‘హిజ్బుల్లాను వీడండి లేకపోతే మీకూ గాజా గతే’.. లెబనాన్ కు నెతన్యాహు వార్నింగ్

Denmark Driving Rules: డెన్మార్క్ డ్రైవింగ్ రూల్స్.. కారులో అవి లేకపోతే ఫైన్ వేస్తారట, అందుకే అక్కడ యాక్సిడెంట్స్ ఉండవ్!

Big Stories

×