Man Dies With No Weekoff| ఏదైనా సరే మితి మీరితే అది వినాశనానికే దారితీస్తుంది. ఇది ప్రకృతి సిద్ధాంతం. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి అంశానికి ఒక పరిమితి ఉంటుంది. ఎంత ఉండాలో.. ఎంత ఉండకూడదో మానవులు శాస్త్రీయంగా పరిశోధనలు, అధ్యయనాలు చేసి కొన్నింటికి పరిమితులు కనుగొన్నారు. ఉదాహరణకు సరైన సమయానికి సరైన మోతాదు ప్రతి జీవి ఆహారం తీసుకోవాలి. ఇందులో సరైన సమయం పాటించపోయినా.. లేక సరైన ఆహార సమతుల్యత లేదా సరైన పౌష్టికాహారం తీసుకోకపోయినా సమస్యలు వస్తాయి.
ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకునే వారు ఊబకాయం లాంటి సమస్యలు ఎదుర్కొంటే.. తక్కువ తినేవారు బలహీనంగా ఉంటారు. అలాగే శరీరానికి తగిన శ్రమ ఉండాలి దాంతో పాటు సరైన నిద్ర, విశ్రాంతి కూడా అవసరం. కానీ ఆధునిక జీవనంలో మనుషులు పరుగులు పెట్టే ఉద్యోగాలు చేస్తున్నారు. ఎల్లవేళలా పనిపైనే దృష్టి పెట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. అలాంటిదే ఒక ఘటన చైనాలో జరిగింది. అక్కడ ఒక ఉద్యోగి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఏకధాటిగా 104 రోజులు కఠిన శ్రమ ఉన్న పని చేసేవాడు. కానీ ఒక రోజు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్పత్రిలో అతడిని పరీక్షించిన డాక్టర్లు అతని శరీరంలో కీలక అవయవాలు పనిచేయడం లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆ వ్యక్తి వారం రోజుల్లోనే మరణించాడు.
వివరాల్లోకి వెళితే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా కథనం ప్రకారం.. చైనాలో ‘అ బావో’ అనే యువకుడు పెయింటర్ పని చేసేవాడు. డిసెంబర్ 2022లో అ బావో ఒక కంపెనీతో కాంట్రాక్టు చేసుకున్నాడు. బిల్డింగ్ పెయింటింగ్ పని.. తగిన గడువులోగా పూర్తి చేస్తానని కాంట్రాక్టులో అంగీకరించాడు.
Also Read: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం
ఈ కాంట్రాక్టు ప్రకారం.. చైనాలోని జేజియాంగ్ రాష్ట్రంలోని జౌషాన్ నగరంలో ఉన్న బిల్డింగ్ కు అతను పెయింటింగ్ పనులు చేయాలి. జనవరి నెలలో అ బావో పెయింటింగ్ పనులు ప్రారంభించాడు. ఆ తరువాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఏప్రిల్ నెల 5 వరకు పనిచేశాడు. అ బావో కు ఆరోగ్యం సమస్యలున్నా పని పూర్తి చేయాలన్న తపన, కంపెనీ ఒత్తిడి వల్ల అతను సెలవు తీసుకోలేదు. కానీ ఏప్రిల్ 5న అ బావో ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఏప్రిల్ 6న అ బావో నడవలేని స్థితిలో సెలవు తీసుకొని తన గదిలోనే విశ్రాంతి తీసుకున్నాడు. అయితా ఆ తరువాత కూడా కొన్ని రోజులు పని చేశాడు. కానీ మే నెల 28న తీవ్ర అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అ బావో కు ఊపిరి తీసుకోవడంలో సమస్య ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించామని అతని స్నేహితులు తెలిపారు.
అ బావో పై డాక్టర్లు పరీక్షలు చేసి అతని ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకిందని తెలిపారు. అతని గుండె, కిడ్నీలు, లివర్ లాంటి కీలక అవయవాలు నామమాత్రంగా పనిచేస్తున్నాయని నిర్ధారణ చేశారు. ఆ తరువాత జూన్ 1 న అ బావో మరణించాడు.
Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..
అ బావో కుటుంబం అతను పనిచేసే కంపెనీపై కేసు వేసింది. అ బావో చావుకి ఆ కంపెనీయే కారణమని అతని కుటుంబం ఆరోపణలు చేసింది. కానీ కంపెనీ తమ తప్పు ఏమీ లేదని.. అ బావో కు ముందు నుంచి ఆరోగ్య సమస్యలుండగా.. వాటి గురించి తమకు చెప్పకుండా దాచాడని ఆరోపించారు. కోర్టులో అ బావో కుటుంబం.. కంపెనీ కృూరంగా అ బావో చేత పనిచేయించిందని వాదించింది.
ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. చైనా చట్టాల ప్రకారం.. ఒకరోజుకు 8 గంటలకు మించి పనిచేయించకూడదని గుర్తు చేస్తూ.. కంపెనీపై 4,10,000 యువాన్ లు (భారత కరెన్సీ దాదాపు రూ.48 లక్షలు) ఫైన్ వేసింది. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కంపెనీ పై కోర్టులో కేసు వేసినా పై కోర్టు కూడా ఆగస్టు లో ఇదే తీర్పుని వెలువరించింది.