South African doctor invents female condoms with teeth to fight rape: దేశంలో దిశా లాంటి ఎన్ని చట్టాలు అమలు అవుతున్నా..అత్యాచార కేసులు అక్కడక్కడా ఇంకా వెలుగు చూస్తునే ఉన్నాయి. దేశ నడిబొడ్డున బస్సులో జరిగిన సంఘటన యావత్ దేశాన్నే కలిచివేసింది. రీసెంట్ గా కోల్ కతాలో లేడీ డాక్టర్ ను అత్యాచారం చేసి హత్య చేశారు నిందితులు. 2021 సంవత్సరంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం 2019లో దేశం మొత్తం లక్ష పన్నెండు వేలకు పైగా అత్యాచార ఫిర్యాదులు రాగా.. వాటిలో కేవలం ఐదు లక్షల కేసులే నమోదు కాబడ్డాయి. దేశంలో ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా, అరెస్టు చేసినా, చివరకు ఎన్ కౌంటర్లు జరిపినా ఎలాంటి మార్పూ కనబడటం లేదు. రాజకీయ పలుకుబడితో డబ్బున్న బడా బాబుల పిల్లలు బెయిల్ పేరుతో ఈజీగా తప్పించుకుంటున్నారు.
హ్యాట్సాఫ్ లేడీ డాక్టర్
వీటికి పరిష్కారం ఏమిటి? కౌన్సిలింగులు, కఠిన చర్యలు ఏవీ కూడా అత్యాచారాలను అదుపు చేయలేకపోతున్నాయి. ప్రతి నిత్యం ఏదో ఒక చోట ఆడవారిపై అత్యాచార, లైంగిక హింసలు జరుగుతునే ఉన్నాయి. అయితే దీనికి ఓ చక్కని పరిష్కార మార్గం కనుక్కున్నారు సౌత్ ఆఫ్రికా కు చెందిన డాక్టర్ సొనెట్ ఎథ్లర్స్. ఆమె ఒక లేడీ డాక్టర్. ప్రతి నిత్యం మహిళలపై జరిగే అత్యాచార సంఘటనలు ఆమెను కలిచివేశాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటే నిందితులు దారిలోకి వస్తారు అని ఆలోచించారామె. తన వైద్య వృత్తిలో పాటు సామాజిక సమస్యలపై ఎక్కువగా స్పందిస్తుంటారు సొనెట్. ప్రస్తుతం సోషల మీడియా మాధ్యమాలలో పెప్పర్ స్స్రే, కారం పొడి అంటూ అవగాహన కల్పిస్తున్నారు. అవేమీ ఇలాంటి దురాఘతాలను ఆపలేవు. అందుకే ఇకపై రేపిస్టులకు ఆ ఆలోచన కూడా కలగనంతగా ఓ భయంకరమైన సాధనాన్ని కనిపెట్టారు సోనెట్. దాని పేరు రేప్ యాక్స్.
రేప్ యాక్స్ ఎలా పనిచేస్తుంది?
పదునైన ముళ్లతో తయారు చేసిన రబ్బరు తొడుగు ఇది. దీనిని కండోమ్ మాదిరిగా స్త్రీలు ధరించవచ్చు. తమ పని తాము చేసుకోవచ్చు. ఎవరైనా మృగంలా మహిళలపైకి దూకి వారిని బలవంతంగా లోబరుచుకోవాలని చూస్తే వెంటనే ఈ రేప్ యాక్స్ తన ముళ్లతో పురుషుల అంగాన్ని తీవ్రంగా రక్తం వచ్చేలా గాయపరుస్తుంది. ఒక్కో సందర్భంలో పురుషుడి వృషణాలు కూడా కట్ అవుతాయి. ప్రతి మహిళా ఈ సమాజంలో స్వేచ్ఛాయుత జీవనం గడపాలని తాను ఆశిస్తున్నానని..సమాజంలో ఒక్కతే ఆడపిల్ల ధైర్యంగా బయటకు వెళ్లాలంటే భయపడే రోజులివి. ఒక్కో సారి నైట్ డ్యూటీ కూడా చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు క్యాబ్ లోనూ లేక ఆటోలోనో ఒంటరిగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అప్పుడు నీచ ప్రవర్తన కలిగిన డ్రైవర్లు కూడా వీరిని దారి మళ్లించి ఎవరూ లేని నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి బలవంతంగా వీరిని లోబరుచుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాంటప్పుడు ఈ యాంటీ రేప్ యాక్స్ సాధనం మహిళల పాలిట దివ్యాస్త్రంగా పనిచేస్తుంది.
ఎవరి సాయం లేకుండానే..
ఎవరి సాయం లేకుండానే మహిళలు మృగాళ్ల నుంచి తమని తాము కాపాడుకోవచ్చు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరూ ఇలాంటి యాంటీ రేప్ యాక్స్ సాధనం ప్రస్తుతం భారతదేశానికి అత్యవసరం అంటున్నారు. ఇలాంటి సాధనం ఉండి ఉంటే కోల్ కతా,దిశ లాంటి సంఘటనలు జరగకుండే ఉండేవని..త్వరలోనే దీనిని అధికారికంగా భారత్ కు తీసుకురావాలని అందరూ కోరుతున్నారు. ఇదే జరగాలని ప్రతి మహిళా నేటి సమాజంలో కోరుకుంటున్నారు. ఇకపై మదమెక్కిన మృగాళ్లు రేప్ పేరు చెబితే చాలు హడలిపోతారు అని కామెంట్స్ వస్తున్నాయి.