Vastu Tips For Money: వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంది తమ ఇంటిని నిర్మించుకుంటారు. కానీ ఇంట్లో వస్తువులను పెట్టే విషయంలో మాత్రం వాస్తు పాటించరు. ఇంట్లోని వస్తువుల దిశ కూడా ఇంట్లో పేదరికం లేదా, సంపదకు కారణం అవుతుంది. అంతే కాకుండా ఇంట్లో వస్తువుల దిశ ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది. ముఖ్యంగా డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైంది. ఇంట్లో డబ్బు నిలిచి ఉండటానికి కొన్ని రకాల వాస్తు నియమాలు పాటించడం అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వస్తిక్: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం మీద ప్రతి రోజు స్వస్తిక్ చిహ్నాన్ని వ్రాయాలి. ఇలా ప్రతి రోజు చేయలేము అనుకునే వారు ఒక శుభ సమయంలో తులుపులపై భాగంలో వెండి స్వస్తిక్ ను ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు నిలిచే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇంట్లో ఉన్న వారు ఆనందంగా ఉంటారు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
లోహ తాబేలు: వాస్తు శాస్త్రం ప్రకారం లోహపు తాబేలు ప్రతిమను ఇంట్లో ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఏది ఏమైనప్పటికీ, హిందూ మతంలో తాబేలును విష్ణువుకు సంబంధించినదిగా చెబుతారు. వాస్తు ప్రకారం, ఇత్తడి, బంగారం, వెండితో చేసిన తాబేలును ఇంటికి ఉత్తర దిశలో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
శ్రీ యంత్రం: వాస్తు శాస్త్రం ప్రకారం, లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి, ఆచారాల ప్రకారం ఇంట్లో శ్రీ యంత్రాన్ని ఉంచి లక్ష్మీ దేవిని పూజించాలి. దీంతో ఇంట్లో సంపద పెరుగుతుంది.
Also Read: అంగారకుడి సంచారం.. ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.
గోమతి చక్రం: వాస్తు శాస్త్రం ప్రకారం శుభ సమయంలో, లేదా శుక్రవారం రోజు ఇంట్లోని పూజగదిలో 11 గోమతి చక్రాలను పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని లక్ష్మీదేవి పాదాల చెంత సమర్పించి పూజించాలి. దీని తరువాత, గోమతి చక్రాన్ని ఎర్రటి వస్త్రంలో చుట్టి డబ్బు పెట్టుకునే సంపద ఉంచండి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యంతోపాటు సంపద కూడా పెరుగుతుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)