E-Paper
Advertisement

Mashco Piro Tribe: అమెజాన్ ఫారెస్టులో అరుదైన తెగ, మాస్కో పైరోగా గుర్తింపు.. తొలిసారి

Mashco Piro Tribe: అమెజాన్ ఫారెస్టులో అరుదైన తెగ, మాస్కో పైరోగా గుర్తింపు.. తొలిసారి
Advertisement

Mashco Piro Tribe: దక్షిణ అమెరికా ఖండం గురించి చెప్పనక్కర్లేదు. అక్కడి ఫారెస్ట్‌లో రకరకాల జీవులు ఉంటాయి. అరుదైన జంతువులు అక్కడ దర్శనమిస్తాయి. అడవుల్లో జంతువులతోపాటు మానవుల గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ అక్కడ అరుదైన ట్రైబల్స్ ఉన్నారని చెబుతున్నారు పరిశోధకులు. కానీ సరైన ఆధారాలు కనిపించలేదు.

తాజాగా అమెజాన్ అడవుల్లో సంచరించే అరుదైన తెగకు సంబంధించి ఫోటోలు, వీడియోలు తొలిసారి వెలుగులోకి వచ్చాయి. ఈ తెగను మాష్కో పైరోగా గుర్తించారు. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా నివసించే గిరిజన తెగల్లో ఇదే అతి పెద్దదిగా వర్ణిస్తున్నారు. పెరూ సమీపంలోని లాస్ పిడ్రాస్ నది సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు. అయితే వీరు ఆటలు ఆడుతున్నారా? జంతువుల వేట కోసం అక్కడికి వచ్చారా అనేది సెకండ్ పాయింట్.

Advertisement

చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకున్న మాదిరిగా కనిపించారు. మాష్కో పైరో తెగకు చెందిన మనుషుల ఒంటిపై దుస్తులు లేవు. కాకపోతే కర్రలతో తయారు చేసిన ఈటె వారి వెపన్. నది ఒడ్డున పదుల సంఖ్యలో కనిపించారు. వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసింది.

ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంతో అక్కడి ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తున్నాయి విదేశీ సంస్థలు. కంపెనీలకు ఆ ప్రాంతాన్ని విక్రయించినట్టు చెబుతున్నాయి. మారుమూల గ్రామాలు మోంటే సాల్వడో, ప్యూర్టో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషణ చేస్తూ కెమెరాకు చిక్కారని అంటోంది. ఈ తెగ బయటకు రావడంతో పోరాటాల గురించి కొత్త విషయాలు తెలిసే అవకాశముందని అంటున్నారు.

Advertisement

ALSO READ: స్టూడెంట్ జాహ్నవి మృతి, అపహాస్యం చేసిన అమెరికా పోలీసులపై వేటు

బ్రెజిల్‌ సరిహద్దులో కూడా మాష్కో పిరో తెగ కనిపించిందని అంటున్నారు. వాతావరణం కాస్త వేడిగా ఉన్న సమయంలో ఆ తెగ‌కి చెందిన వ్యక్తులు తాబేలు గుడ్ల కోసం అక్కడికి వస్తారని అంటున్నారు. అప్పుడు మాత్రమే ఇసుక మీద వారి పాద ముద్రలు కనిపిస్తాయని అంటున్నారు. నది ఒడ్డున చాలావరకు తాబేలు పెంకులు వుంటాయని గుర్తు చేస్తున్నారు.

 

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×