BigTV English

Fire Accident : రాజధానిలో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది సజీవదహనం

Fire Accident : రాజధానిలో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది సజీవదహనం
bangladesh fire accident
bangladesh fire accident

Fire Accident in Bangladesh : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఏడంతస్తుల రెస్టారెంట్ లో మంటలు చెలరేగడంతో.. సుమారు 44 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. 75 మందిని రక్షించారు. రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


ఢాకా బెయిలీలోని రోడ్డులో ఉన్న బిర్యానీ రెస్టారెంట్ లో గురువారం రాత్ర మంటలు చెలరేగాయని తమకు సమాచారం అందిందని అగ్నిమాపక అధికారి మహమ్మద్ షిహబ్ వెల్లడించారు. మంటలు క్రమంగా పై అంతస్తులకు వ్యాపించాయని, రెండుగంటల్లోనే వాటిని అదుపులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. కాగా.. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారెంట్లు, క్లాత్ షోరూమ్స్, మొబైల్ ఫోన్ల విక్రయ కేంద్రాలు అధికంగా ఉన్నాయి.

Read More : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. కుమార్తెను ప్రేమించిన యువకుడిని హతమార్చిన తల్లిదండ్రులు


ప్రమాద ఘటనపై రెస్టారెంట్ మేనేజర్ సోహెల్ ఇలా చెప్పారు. తాము ఆరవ అంతస్తులో ఉండగా.. మెట్ల మార్గం గుండా పొగ వస్తుండటాన్ని గమనించామన్నారు. అప్పుడు అందరూ కిందినుంచి పైకి పరిగెత్తుతూ వచ్చారని, ప్రమాదాన్ని గ్రహించి.. తామంతా నీటి పైపుల ద్వారా కిందికి దిగినట్లు చెప్పారు. కొందరు ప్రాణాలను కాపాడుకునేందుకు పై నుంచి దూకడంతో గాయాలయ్యాయని, మరికొందరు సహాయం చేయాలంటూ కేకలు వెశారన్నారు. కాగా.. 2019 ఫిబ్రవరిలో కూడా డాకాలో అపార్ట్ మెంట్ బ్లాకుల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 70 మంది దుర్మరణం చెందారు. 2021 జులైలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది పిల్లలు సహా 52 మంది మృతి చెందారు.

Related News

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Donald Trump: 8 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వరా? పాపం, ట్రంప్ మామ బాగా హర్ట్ అయ్యాడు కాబోలు

Nobel Prize Peace: ట్రంప్‌‌కు బిగ్ షాక్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికంటే..?

Donald Trump: నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరేనా?

Big Stories

×