Big Stories

Operation Valentine Review: వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

- Advertisement -

Operation Valentine Review: మెగా హీరో వరుణ్ తేజ్ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్టులతో కూడిన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇక వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. పెద్దగా ఫలితం దక్కడం లేదు. ఫిదా, గద్దలకొండ గణేష్, తొలిప్రేమ సినిమాల తర్వాత వరుణ్ తేజ్‌కు మరో హిట్టు పడలేదు.

- Advertisement -

ఎన్నో ఆశలు పెట్టుకున్న గని, గాంఢీవదారి అర్జున సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. అయినా తన ప్రయత్నం మాత్రం వరుణ్ ఆపలేదు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ మూవీ చేశాడు. ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుల్వామా దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు పూర్తి రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్), అతని భార్య అహనా గిల్ (మానుషీ చిల్లర్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా ఉంటారు. ఇందులో అహనా గిల్ రాడార్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటుంది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ వజ్ర పేరుతో ఒక మిషన్‌ను టెస్ట్ చేస్తుంది.

READ MORE: ఒక విచిత్ర వ్యాధి.. మూఢ నమ్మకం.. పరిశోధన.. కలయికే “గామి”!

తక్కువ ఎత్తు అంటే 20మీటర్ల ఎత్తులో ఫైటర్ జెట్స్ నడిపితే శత్రువుల శత్రువుల రాడార్‌కు చిక్కకుండా ఉండటంతో ఫైలెట్స్ ప్రాణాలు కాపాడవచ్చు అనేది దీని కాన్సెప్ట్. అయితే దాన్ని వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్) పరీక్షించాలనుకుంటాడు.

అది విఫలం కావడంతో ఆ ప్రమాదంలో కబీర్ (నవదీప్) చనిపోతాడు. దీంతో ఆ టెస్ట్‌ను, వజ్ర మిషన్‌ను పక్కన పెట్టేస్తుంది. ఆ తరువాత కొన్నేళ్లకు అర్జున్ దేవ్ కోలుకుంటాడు. అనంతరం 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారతీయ జవాన్ల మీద పాకిస్తాన్ దాడి చేస్తుంది.

అందులో మన వీర సైనికులు మరణిస్తారు. ఆ తర్వాత దీనికి ప్రతీకార చర్యగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్‌లోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చాక.. పాకిస్తాన్ ఎలా స్పందిస్తుంది. పాకిస్తాన్ చేపట్టిన చర్యలు? ఆ సమయంలో అర్జున్ దేవ్ ఏం చేశాడు అనేది తెరపై చూడాల్సిందే.

READ MORE: దృశ్యం చిత్రానికి మరో ఘనత.. హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న తొలి భారతీయ సినిమా..

విశ్లేషణ:

పుల్వామా ఎటాక్‌లో మన సైనికులు చనిపోయిన ఘటన దేశాన్ని ఎంతలా కుదిపేసిందో మనందరికీ తెలిసిందే. అంతటి ఎమోషన్ ఉన్న అంశాలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు.. చాలా ఎమోషనల్‌ అనిపించాలి. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల హృదయాలను తాకాలా. కానీ ఆ ఎమోషన్‌ ఇందులో కనిపించదు. ముఖ్యంగా ఎమోషన్ ఇందులో మిస్ అవుతుంది. ఇందులోని ట్వాస్టులు కూడా ప్రేక్షకుల్ని ఎలాంటి సర్ప్రైజ్ చేయవు.

హ్యూమన్ ఎమోషన్స్ పరంగా చూస్తే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ బలమైన సన్నివేశాలను రాసుకోలేదు. చాలా సీన్స్‌ను ఎంతో ఎమోషనల్‌గా తీయవచ్చు. ఆపరేషన్ వజ్ర మిషన్ గురించి ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదేదో జరిగిపోతోన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏం జరగదు. అంతా సెకండాఫ్ కోసం సెటప్‌లానే అనిపిస్తుంది. అంతేకాకుండా ఫైటర్ జెట్ స్పీడుతో చేసే మూమెంట్స్ కూడా అంతగా ఏమీ లేవు. ఇక ఇందులో కొన్ని సార్లు పదాలు అర్థం కావు.

సెకండాఫ్‌ కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ మీద ఎటాక్ చేసే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్లో గూస్ బంప్స్‌ తెప్పిస్తాయి. పాకిస్తాన్‌లోకి వెళ్లి ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వారిని మట్టు బెట్టి తిరిగి రావడం అంటే అంత ఆశామాషి విషయం కాదు. ఆ సాహసాన్ని మన వైమానిక దళం చేసి.. పుల్వామా దాడి ప్రతీకారంగా మన దేశం ఈ సర్జికల్ స్ట్రైక్‌ను చేపట్టింది.

READ MORE: పోలీసు పాత్రలపై వివాదాస్పద వ్యాఖ్యలు .. క్షమాపణలు చెప్పిన నాగబాబు..

ఫస్ట్ హాఫ్ అంతా గందరగోళంగా, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయించలేకపోవడంతో పెద్దగా ఏమీ అనిపించదు. చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం దేశ భక్తి నరనరాల్లోకి వచ్చేస్తుంది.

టెక్నికల్‌గా కొన్ని సార్లు అద్భుతం అని అనిపిస్తుంది. ఇంకొన్ని సార్లు వీఎఫ్ఎక్స్ పెద్దగా ఆకట్టుకోనట్టుగా అనిపిస్తుంది. విజువల్స్ పరంగా బాగున్నాయనే చెప్పాలి. మిక్కి జే మేయర్ ఆర్ఆర్ బాగుంది. మాటలు అంత అట్రాక్టివ్‌గా ఏమీ అనిపించవు.

నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇందులో వరుణ్ తేజ్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఎయిర్ ఫోర్స్ అధికారిగా అర్జున్ దేవ్ పాత్రలో కటౌట్ కరెక్ట్ సరిపోయింది చాలా ఎమోషనల్‌గా నటించాడు. అలాగే మానుషి చిల్లర్ ఓకే. నవదీప్‌కు మధ్యలోనే అంతమయ్యే కారెక్టర్ దొరికింది.

READ MORE: ఒక్క సీన్ కోసం రూ.50 కోట్లు.. పుష్పగాడి రూల్ మామూలుగా లేదు..!

అభినవ్ గోమఠం కష్టంగా ఓ మూడు నాలుగు సీన్లలో కనిపిస్తాడు. ఇక మొత్తంగా చూస్తే ఈ సినిమా మరీ అంత తీసి పారేసేలా రకంగా ఉండదు. ఫస్ట్ హాఫ్‌ను కాస్త ఓర్చుకుంటే.. సెకండాఫ్‌ను కాసేపు ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్‌గా ఆపరేషన్ వాలెంటైన్ మూవీని ఒకసారి చూడవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News