BigTV English

China : భయంకరమైన వైరస్ పై చైనా ప్రయోగాలు..? మరణాల రేటు 100 శాతమే..!

China : కరోనా వైరస్‌ జాతికి చెందిన ఓ ప్రమాదకర ఉపరకంపై చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్‌ వల్ల మరణాల రేటు 100 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి పుట్టుక రహస్యం ఇప్పటికీ వీడనేలేదు. ఈ వైరస్‌ను చైనానే సృష్టించిందని ప్రపంచ దేశాలు ఆరోపించాయి. ప్రపంచదేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలని చైనా భావించిందనే విశ్లేషణలు వ్యక్తమయ్యాయి.

China : భయంకరమైన వైరస్ పై చైనా ప్రయోగాలు..? మరణాల రేటు 100 శాతమే..!

China : కరోనా వైరస్‌ జాతికి చెందిన ఓ ప్రమాదకర ఉపరకంపై చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్‌ వల్ల మరణాల రేటు 100 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి పుట్టుక రహస్యం ఇప్పటికీ వీడనేలేదు. ఈ వైరస్‌ను చైనానే సృష్టించిందని ప్రపంచ దేశాలు ఆరోపించాయి. ప్రపంచదేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలని చైనా భావించిందనే విశ్లేషణలూ వ్యక్తమయ్యాయి.


డ్రాగన్‌ మాత్రం వీటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉంది. ఏదేమైనా కోవిడ్ భయాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కుదుటపడుతోంది. ఈ క్రమంలోనే మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. బీజింగ్ లో కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్‌పై ప్రయోగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయంగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దాని వల్ల మరణాల రేటు 100 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వుహాన్ లో జరిపిన ఓ అధ్యయనంలో ఈ భయంకరమైన విషయాలు బయటపడినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. ఆ అధ్యయన వివరాల ప్రకారం.. SARS-CoV-2కు చెందిన GX_P2V అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది 2017లో వెలుగుచూసిన జీఎక్స్‌ ఉత్పరివర్తనంగా తెలుస్తోంది. గతంలో దీన్ని మలేషియన్‌ పాంగోలిన్స్‌ జంతువుల్లో గుర్తించారు.


మొదటగా శాస్త్రవవేత్తలు GX_P2V మ్యుటేటెడ్ వెర్షన్‌ను ఎలుకలపై ప్రయోగించారట. వాటిపై ఈ వైరస్‌ తీవ్ర ప్రభావం చూపించిందని వెల్లడించింది. ఎనిమిది రోజుల్లోనే ఎలుకలన్నీ మరణించాయని అధ్యయనం పేర్కొన్నది. దీని కారణంగా ఎలుకల ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్లు, మెదడు దెబ్బతిన్నాయని తెలిపింది. బరువు తగ్గి బలహీనంగా మారాయని, కొన్ని రోజుల్లోనే కనీసం నడవలేని స్థితికి వాటి ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ వైరస్‌ చాలా ప్రమాదకరమైందని అధ్యయనం పేర్కొంది.

ఇది మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై స్పష్టత లేనప్పటికీ.. దాదాపు ఇలాంటి లక్షణాలే ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ‘‘GX_P2V వైరస్‌తో మనుషులకు పెను ముప్పు వాటిల్లనుందని అర్థమవుతోందని అధ్యయనకారులు పేర్కొన్నారు. దీంతో డ్రాగన్‌ ప్రయోగాలు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. కాగా.. తాజా ప్రయోగాలతో వుహాన్‌ ల్యాబ్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. వుహాన్ నుంచే కరోనా వైరస్‌ లీక్‌ అయ్యిందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే.

Tags

Related News

California: చెట్టును తాకి లైవ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

Americal News: అమెరికాలో మళ్లీ.. ఓ పాఠశాల కాల్పుల కలకలం, ఆరుగురు మృతి

Japan Flu Outbreak: జపాన్ లో విజృంభిస్తోన్న ఫ్లూ మహమ్మారి.. 4 వేలకు పైగా కేసులు, స్కూళ్లు మూసివేత

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Big Stories

×