E-Paper
Advertisement

చైనా అంతరిక్ష కలలకు గట్టి ఎదురుదెబ్బ.. మంటల్లో కలిసిన ప్రైవేట్ రాకెట్ ప్రయోగం.. ఇదిగో వీడియో!

చైనా అంతరిక్ష కలలకు గట్టి ఎదురుదెబ్బ.. మంటల్లో కలిసిన ప్రైవేట్ రాకెట్ ప్రయోగం.. ఇదిగో వీడియో!
Advertisement

China Rocket: అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యం అమెరికాకు సవాల్ విసురుతూ, ప్రైవేట్ రాకెట్ల ప్రయోగాల్లో దూసుకుపోతున్న చైనాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ‘స్పేస్ పయనీర్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తియాన్‌లాంగ్-3 రాకెట్ ప్రయోగం ఫెయిల్ అయ్యింది. హెనాన్ ప్రాంతంలోని గాంగ్‌యీ నగర సమీపంలో ఉన్న డాంగ్‌ఫెంగ్ కమర్షియల్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ కేంద్రం నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. అయితే, రాకెట్ ఇంజిన్లను భూమిపై ఉంచి పరీక్షించే క్రమంలో, సాంకేతిక లోపం తలెత్తి రాకెట్ అకస్మాత్తుగా నింగిలోకి దూసుకెళ్లిపోయింది. కొద్దిసేపటికే అది నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న పర్వత ప్రాంతంలో పేలిపోవడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

విఫలమైన ‘చైనా స్పేస్-ఎక్స్’ కలలు
అమెరికాకు చెందిన ఎలాన్ మాస్క్ ‘స్పేస్-ఎక్స్’ సంస్థకు ధీటుగా ఈ తియాన్‌లాంగ్-3 రాకెట్‌ను అభివృద్ధి చేశారు. ఇది స్పేస్-ఎక్స్ యొక్క ఫాల్కన్-9 రాకెట్ తరహాలోనే పనిచేస్తుందని, ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి పంపుతుందని చైనా ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రయోగం ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే రాకెట్ నిర్మాణం నుంచి విడిపోయి కూలిపోవడం చైనా వాణిజ్య అంతరిక్ష పరిశోధనలకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. ముఖ్యంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతరిక్షంలో ఆధిపత్యం చెలాయించాలనుకున్న చైనా వ్యూహాలకు ఇది బ్రేక్ వేసింది.

Advertisement

భయానక దృశ్యాలు.. ప్రాణనష్టం తప్పింది!
రాకెట్ గాలిలోకి ఎగిరి, మంటల్లో చిక్కుకుని కిందకు పడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాకెట్ పేలిన ధాటికి సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ప్రయోగశాల అధికారులు ముందుగానే పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక యంత్రాంగం వెల్లడించింది. రాకెట్ శకలాలు జనవాసాలకు దూరంగా పడటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: అమెరికాకు ఇరాన్ షాక్.. రూ. 931కోట్ల విలువ చేసే ఎఫ్-35 ఖేల్ ఖతం!

Advertisement

చైనా స్పేస్ రంగంపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది?
ఈ వైఫల్యం కేవలం ఒక రాకెట్ కూలిపోవడం మాత్రమే కాదు, చైనా ప్రైవేట్ అంతరిక్ష రంగం యొక్క భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. చైనా ప్రభుత్వం తన అంతరిక్ష ప్రయోగాల్లో వాణిజ్య రంగాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో ఇలాంటి సాంకేతిక లోపాలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే, ఈ లోపాలను సరిదిద్దుకుని త్వరలోనే సరికొత్త సాంకేతికతతో మళ్ళీ ముందుకు వస్తామని స్పేస్ పయనీర్ సంస్థ ప్రకటించింది. రాబోయే రోజుల్లో తియాన్‌లాంగ్-3 పునరాగమనం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related News

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

Big Stories

Advertisement
×