E-Paper
Advertisement

అమెరికాకు ఇరాన్ షాక్.. రూ. 931కోట్ల విలువ చేసే ఎఫ్-35 ఖేల్ ఖతం!

అమెరికాకు ఇరాన్ షాక్.. రూ. 931కోట్ల విలువ చేసే ఎఫ్-35 ఖేల్ ఖతం!
Advertisement

Iran Downs US F-35 Fighter Jet: మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఇప్ప‌ట్లో త‌గ్గేలా లేవు. రోజురోజుకి మరింత భీభత్సంగా ఎగసిపడుతున్నాయి. ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన రెండవ ఎఫ్-35 (F-35) ఫైటర్ జెట్‌ను కూల్చిన‌ట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. తమ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఆర్‌జీసీ (IRGC) ఏరోస్పేస్ ఫోర్స్ రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు మెహర్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ప్రమాదంలో విమానం భారీ పేలుడుతో కూలిపోవడంతో పైలట్ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఖాతం అల్-అన్బియా ప్రధాన కార్యాలయ ప్రతినిధి పేర్కొన్నారు.

ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కూడా ఈ విమానం కూలిన వీడియోను ఎక్స్ వేదిక‌గా పంచుకుంటూ, ఇరాన్ ఒక శక్తివంతమైన దేశమని రాసుకొచ్చింది. మార్చి 19న మొదటి ఎఫ్-35ను కూల్చివేసినట్లు ప్రకటించిన ఇరాన్, ఇప్పుడు రెండవ యుద్ధ విమానాన్ని కూడా ధ్వంసం చేయడం అమెరికాకు మింగుడు ప‌డ‌డం లేదు.

Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై మరింత కఠినంగా దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. గురువారం అర్థరాత్రి తన Truth Social వేదికగా స్పందిస్తూ.. ఇరాన్‌లోని అతిపెద్ద వంతెన (బి1 వంతెన) ను అమెరికా దళాలు కూల్చివేశాయని, తమ శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే ఎదురయ్యే పరిణామాలకు ఇది ఒక హెచ్చ‌రిక మాత్రమేనని పేర్కొన్నారు. దీనిపై ఇరాన్ స్పందిస్తూ, ట్రంప్‌ను ఒక ఓటమి పాలైన వ్యక్తిగా ఎద్దేవా చేసింది.

F-35 విమానం ధర సుమారు 80 మిలియన్ డాలర్ల నుండి 85 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. భారత రూపాయిల్లో రూ. 931 కోట్ల విలువ ఉంటుంది. F-35కు ఎందుకు అంత ధర అంటే.. శత్రువుల రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగల సామర్థ్యం దీనికి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన సెన్సార్లు, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ కలిగి ఉన్న ఐదవ తరం యుద్ధ విమానం. ఇది గగనతల పోరాటాలతో పాటు, భూమిపై ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి, నిఘా కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇది గంటకు సుమారు 1,900 కి.మీ (Mach 1.6) వేగంతో ప్రయాణించగలదు.

Advertisement

ఒకవైపు అమెరికా భూత‌ల దాడుల‌కు సిద్ద‌మ‌వుతుండ‌గా, మరోవైపు ఇరాన్ తన క్షిపణి దాడులను ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ముమ్మరం చేసింది. శుక్రవారం తెల్లవారుజామున టెహ్రాన్, ఇస్ఫహాన్ నగరాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అదే సమయంలో, కువైట్‌లోని Mina al-Ahmadi చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ డ్రోన్లు దాడి చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా ఈ దాడిని ధృవీకరించింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది.

Read Also: ఇరాన్ యుద్ధం వేళ అమెరికా సైన్యంలో లుకలుకలు.. ఆర్మీ చీఫ్‌పై వేటు, వేగంగా మారుతున్న సమీకరణాలు

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×