E-Paper
Advertisement

Urvashi Rautela: ఆ మొసలి నెక్లెస్‌ ధర 276 కోట్లు?.. ఊర్వశిపై మళ్లీ ట్రోలింగ్..

Urvashi Rautela: ఆ మొసలి నెక్లెస్‌ ధర 276 కోట్లు?.. ఊర్వశిపై మళ్లీ ట్రోలింగ్..
Advertisement
Urvashi-Rautela-Necklace

Urvashi Rautela: ఊర్వశి రౌతేలా. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవితో కలిసి ఆడిపాడింది. ‘ఏజెంట్‌’లోనూ అలరించింది. ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తళుక్కున మెరిసింది. పింక్ కలర్ గౌన్‌లో బార్బీ బొమ్మలా తయారైంది. అంతా బానే ఉందికానీ.. ఆ మెడలోనే ఏదో తేడాగా ఉంది. చెవులకూ అంతే. మొసలి ఆకారంలో ఉన్న నెక్లెస్ (crocodile necklace)తో కేన్స్‌లో కనిపించడం.. చెవులకు మొసలి రింగులు పెట్టుకోవడం.. సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ అవడం తెలిసిందే. లేటెస్ట్‌గా ఈ నెక్లెస్ గురించి మరో అప్‌డేట్ మరింత వైరల్ అవుతోంది.

ఊర్వశి రౌతేలా ఫేక్ నెక్లెస్ పెట్టుకున్నారంటూ నెటిజన్లు కామెంట్లతో కుమ్మేశారు. కేన్స్‌లో ఇలా చీప్ ఆర్నమెంట్స్ వేసుకుంటారా? అంటూ కుళ్లబొడిచారు. ఆ విమర్శలపై స్పందిస్తూ.. తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది ఊర్వశి టీమ్. ఆ మొసలి నెక్లెస్ ఫేక్ ఆర్నమెంట్ కాదట. దాని ధర 276 కోట్ల వరకూ ఉంటుందట. మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, విజయాలకు అది చిహ్నం.. అంటూ పోస్ట్‌ చేయడంతో అంతా అవాక్కవుతున్నారు.

Advertisement

అవునా? నిజమా? ఆ మొసలి నెక్లెస్, మొసలి చెవి రింగుల ధర అంత ఉంటుందా 276 కోట్లు అంటే మాటలా? ఇది కూడా ఫేకే అంటూ మళ్లీ రివర్స్ అటాక్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే, ఆ నెక్లెస్ ధర అంత ఉండొచ్చని.. మీకు తెలీనంత మాత్రాన అది ఫేక్ గొలుసు కాదంటూ మరికొందరు రౌతేలాకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

ఇక, కేన్స్‌లో ఊర్వశి ఫ్యాషన్ లుక్స్ మామూలుగా లేవు. మొసలి నెక్లెస్ తర్వాత డార్క్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ లిప్‌స్టిక్‌తో మరోసారి హంగామా చేసింది. ఆ తర్వాత గ్రీన్ కలర్ వెరైటీ డ్రెస్‌తో పక్షి ఆకారంలో హొయలు పోయింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×