Big Stories

Gmail Accounts: చాలామంది జీమెయిల్ అకౌంట్స్ డిలీట్.. ఎందుకంటే..?

Gmail Accounts: స్మార్ట్ ఫోన్ అనేది యూజర్ల ప్రైవసీకి భంగం కలిగిస్తుందని యూజర్లకు తెలిసినప్పటి నుండి ప్రైవసీ కోసం యాప్స్ అన్నీ పాటుపడుతున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. కొత్త ఫీచర్లను యాడ్ చేస్తున్నాయి. గూగుల్ కూడా వారి బాటలోనే నడుస్తోంది. ఇప్పటికే ప్రైవసీ విషయంలో గత కొన్నిరోజులుగా ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఒకేసారిగా చాలామంది జీమెయిల్ అకౌంట్లను డిలీట్ చేయడం మొదలుపెట్టింది గూగుల్.

- Advertisement -

చాలామంది జీమెయిల్ అకౌంట్స్ ఇప్పుడు డిలీట్ అయ్యే ప్రమాదంలో పడ్డాయి. ఇదంతా గూగుల్ కొత్త పాలసీలో భాగమే అని యాజమాన్యం ప్రకటించింది. ఇందులో భాగంగానే జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోలలో కూడా ఎన్నో అకౌంట్స్ డిలీజ్ కానున్నాయి అని ముందస్తుగానే సమాచారం అందించింది. కానీ దీని వల్ల జీమెయిల్ యూజర్లు ఎవరూ కలవరపడాల్సిన అవసరం లేదని యాజమాన్యం చెప్తోంది. ఈ పాలసీ అనేది కేవలం ఇనాక్టివ్ యూజర్లను మాత్రమే టార్గెట్ చేస్తుందని బయటపెట్టింది.

- Advertisement -

రెండేళ్లకు పైగా ఎవరైతే జీమెయిల్ అకౌంట్‌ను ఉపయోగించడం లేదో వారు అకౌంట్లు మాత్రమే డిలీట్ కానున్నాయని గూగుల్ ప్రకటించింది. ఒకప్పుడు జీమెయిల్ అకౌంట్‌ను ఓపెన్ చేసి ఆ తర్వాత దాని గురించి పూర్తిగా మర్చిపోయింటే మాత్రం ఆ అకౌంట్ ఇప్పుడు డిలీట్ అయిపోతుందని అర్థం. మర్చిపోయిన అకౌంట్‌లో ఎలాంటి సమాచారం ఉండదు కాబట్టి ఈ పాలసీ గురించి ఆలోచించాల్సిన అవసరం యూజర్లకు ఉండదని గూగుల్ అంటోంది. ఈ ఏడాది డిసెంబర్ నుండి ఈ పాలసీ ప్రారంభం కానుందని చెప్పింది.

కేవలం పర్సనల్ అకౌంట్లకు మాత్రమే ఈ పాలసీ అప్లై అవుతుందని గూగుల్ తెలిపింది. ఒకవేళ అది బిజినెస్ అకౌంట్ అయితే మాత్రం డిలీట్ అయ్యే అవకాశం లేదని యాజమాన్యం చెప్తోంది. అసలు గూగుల్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అని ప్రశ్నించగా సైబర్ సెక్యూరిటీ అనే సమాధానం వినిపిస్తోంది. ఎక్కువకాలం ఉపయోగించకుండా ఉన్న జీమెయిల్ అకౌంట్స్ అనేవి హ్యాకర్లు ముఖ్య టార్గెట్‌గా ఉంటాయని, దీని ద్వారా వారు పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని గూగుల్ బయటపెట్టింది.

ఒకవేళ ఉపయోగించని జీమెయిల్ అకౌంట్‌ను డిలీట్ అవ్వకుండా కాపాడుకోవాలంటే ఒక ప్రక్రియను ఫాలో అవ్వమని గూగుల్ అంటోంది. రెండేళ్లకు ఒకసారి అయినా ఉపయోగించని జీమెయిల్ అకౌంట్‌ను ఓపెన్ చేసి చూస్తుండాలని తెలిపింది. ఒకవేళ అకౌంట్‌ను డిలీట్ చేయాలనుకున్నా కూడా గూగుల్.. చాలా రోజుల నుండే యూజర్లకు నోటిఫికేషన్ పంపించనున్నట్టు చెప్పింది. ఈ కొత్త పాలసీ అనేది జీమెయిల్ యూజర్లకు ప్రైవసీతో పాటు సైబర్ సెక్యూరిటీ కూడా అందిస్తుందని గూగుల్ భావిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News