BigTV English

UPSC Civils Result: సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు.. ఇరగదీశారు..

UPSC Civils Result: సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు.. ఇరగదీశారు..
upsc

UPSC Civils Result: ఈసారి ఫలితాల్లో అమ్మాయిలే టాప్. ఇది రెగ్యులర్‌గా వినిపించే మాటే. టెన్త్, ఇంటర్, ఎంసెట్.. ఇలా ఏ రిజల్ట్స్ అయినా లేడీస్ ఫస్ట్. అయితే, యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో అమ్మాయిల ఆధిపత్యం అంతగా ఉండేది కాదు. కానీ, ఈసారి అక్కడా ఇరగదీశారు. తొలి నాలుగు ర్యాంకులు వాళ్లే కొల్లగొట్టి అదరగొట్టారు. సిలిల్స్ లోనూ తమకు తిరుగులేదని నిరూపించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి మంచి ర్యాంకులు వచ్చాయి.


ఇషితా కిశోర్‌ ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్. గరిమ లోహియా, ఉమా హారతి, స్మృతి మిశ్రా.. ఆ తర్వాతి రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించారు. మూడో ర్యాంక్ సాధించిన ఉమా హారతి.. తెలంగాణ అమ్మాయే. నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె కావడం విశేషం.

తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతికి చెందిన జీవీఎస్‌ పవన్‌ దత్తా 22 ర్యాంకు సాధించాడు. శాఖమూరి శ్రీసాయి అర్షిత్‌కి 40 ర్యాంకు, ఆవుల సాయికృష్ణ 94, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్‌ కుమార్‌ 157, కమతం మహేశ్‌కుమార్‌ 200, రావుల జయసింహారెడ్డి 217, బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్‌.చేతనా రెడ్డి 346, శృతి యారగట్టి 362, యప్పలపల్లి సుష్మిత 384, సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న 462 ర్యాంకులతో సివిల్స్‌లో తెలుగు పతాకం ఎగరేశారు.


2022 ఏడాదికి గాను మొత్తం 933 మందిని యూపీఎస్సీ(UPSC) సెలెక్ట్ చేసింది. జనరల్‌ కోటాలో 345 మంది, EWS కేటగిరీలో 99, ఓబీసీ 263, ఎస్సీ 154, ఎస్టీ నుంచి 72 మంది ఎంపిక అయ్యారు.

933 మందిలో 180 మంది ఐఏఎస్‌, 200 మంది ఐపీఎస్, 38 మంది ఐఎఫ్‌ఎస్‌ కానున్నారు. సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌-ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్‌ బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ ప్రకటించింది.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×