CORONA: కరోనా.. ఈ పేరు వినగానే ఇప్పటికీ చాలా మంది వణికిపోతుంటారు. ప్రపంచ దేశాలను గడగడలాడించింది ఈ వైరస్. దాదాపు మూడు సంవత్సరాలుగా జనాలను పట్టిపీడిస్తోంది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది రోడ్డున పడ్డారు. క్రమంగా ఈ వైరస్ అదుపులోకి వచ్చినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో మళ్లీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
అయితే ఈ వైరస్ గబ్బిలాల నుంచి సంక్రమించినట్లు ఇప్పటికే కొందరు శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాజాగా ఈ వైరస్ పుట్టుకకు సంబంధించి మరో కొత్త విషయాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వైరస్ శునకాల నుంచి పుట్టుకొచ్చిందని తమ పరిశోధనల్లో తేలినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
2020లో చైనాలోని వూహాన్ సీఫుడ్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు జన్యు నమూనాలను సేకరించారు. వాటిపై చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ మార్కెట్లో అమ్ముతున్న రకూన్ డాగ్స్ నుంచే కరోనా వైరస్ పుట్టినట్లు తేలింది.
Hearing Issue:చెవి వినికిడి లోపం ఉన్నవారికోసం టెక్నాలజీ..
JrNTR : నెక్ట్స్ సినిమాను ఆపేస్తా.. NTR 30పై ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్స్