Disney: ఐటీరంగంలోనే కాకుండా.. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కూడా తొలగింపుల పర్వం కొనసాగుతోంది. దిగ్గజ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ డిస్నీ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు కంపెనీ సీఈవో బాబ్ ఐగర్ వెల్లడించారు.
పెద్ద ఎత్తున తమ సబ్‌స్క్రైబర్లను కోల్పోవడంతో పాటు ఆదాయం కూడా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ.. లేఆఫ్స్ విషయాన్ని వెల్లడించారు. గడిచిన మూడునెలల్లో తమ సబ్‌స్రైబర్ల సంఖ్య 1శాతం తగ్గి 168.1 మిలియన్లకు చేరిందని చెప్పారు. కంపెనీ ఆదాయం 23.512 బిలియన్ డాలర్లు.. లాభం 1.279 బిలియన్ డాలర్లుగా నమోదైందని వివరించారు.