California Murder: అమెరికా కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఓ భారతీయుడు.. పబ్లిక్ సె* అఫెండర్ రిజిస్ట్రీలో పేరును చూసి ఒక వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశాడు. నిందితుడిని వరుణ్ సురేష్ (29) గా, బాధితుడిని డేవిడ్ బ్రిమ్మెర్ (71) గా పోలీసులు గుర్తించారు.
ఈ సంఘటన ఫ్రీమాంట్ నగరంలోని బాధితుడి నివాసంలో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలిఫోర్నియాలోని మెగాన్స్ లా వెబ్‌సైట్‌లో లైంగిక నేరస్థుడిగా పేరు నమోదైన బ్రిమ్మెర్ గతంలో ఒక పిల్లవాడిని వేధించినందుకు తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. పోలీసులు సంఘటనాస్థలికి వచ్చే సమయానికి బ్రిమ్మెర్ మరణించాడు. ఘటనాస్థలిలో సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో అరెస్టైన సురేష్ విచారణలో లైంగిక నేరస్థులందరూ “చనిపోవడానికి అర్హులు”, అందుకే అతడిని హత్య చేశానని పోలీసులకు చెప్పాడు. లైంగిక నేరస్థుల డేటాబేస్‌లో బ్రిమ్మెర్ వివరాలు చూశాడు సురేష్. పబ్లిక్ అకౌంటెంట్‌గా నటించి క్లయింట్ల కోసం ఇంటింటికీ వెళ్లి బ్రిమ్మెర్ కోసం గాలించాడు. తనపై అనుమానం రాకుండా నోట్‌బుక్, బ్యాగ్ పట్టుకుని ఇంటింటికీ వెళ్లాడు.
బ్రిమ్మెర్ ఇంటిని గుర్తించిన సురేష్.. చుట్టు పక్కల వారి ఇళ్లను కూడా మారువేషంలో సందర్శించాడు. దీంతో ప్రజలకు అతడిపై అనుమానం రాదని భావించాడు. చివరిగా బ్రిమ్మెర్ ఇంటికి వెళ్లి అతడి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి కత్తితో దాడి చేశాడు. మెడపై తీవ్రగాయం కావడంతో బ్రిమ్మెర్ మృతి చెందాడు.
Also Read: అసెంబ్లీలో బాలయ్య వ్యంగ్య కామెంట్స్‌పై చిరంజీవి స్పందన.. కీలక ప్రకటనతో..
హత్య చేసిన తర్వాత పోలీసులను పిలవాలనుకున్నానని, పారిపోయేందుకు తాను ప్లాన్ చేయలేదని విచారణలో సురేష్ పోలీసులకు చెప్పాడు. 2021లో సురేష్ ఫ్రీమాంట్‌లోని హయత్ ప్లేస్‌లో ఒక బ్యాగ్‌ను వదిలి వెళ్లి నకిలీ బాంబు బెదిరింపునకు పాల్పడ్డాడు. అలాగే పలు దొంగతనాల కేసులో అరెస్టు అయ్యాడు.