E-Paper
Advertisement

Houthi Rebels | అమెరికా నౌకపై దాడి చేసిన హౌతీ రెబెల్స్.. ఎవ్వరినీ వదిలేది లేదని వార్నింగ్!

Houthi Rebels | ఎర్ర సముద్రంలో హౌతీ విద్రోహులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన కంటైనర్ షిప్ గిబ్రాల్టర్‌ ఈగల్‌పై హౌతీలు బాలిస్టిక్ మిసైల్స్‌తో దాడులు చేశారు. ఈ దాడుల తరువాత షిప్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం.

Houthi Rebels | అమెరికా నౌకపై దాడి చేసిన హౌతీ రెబెల్స్.. ఎవ్వరినీ వదిలేది లేదని వార్నింగ్!
Advertisement

Houthi Rebels | ఎర్ర సముద్రంలో హౌతీ విద్రోహులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన కంటైనర్ షిప్ గిబ్రాల్టర్‌ ఈగల్‌పై హౌతీలు బాలిస్టిక్ మిసైల్స్‌తో దాడులు చేశారు. ఈ దాడుల తరువాత షిప్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే షిప్‌లో ఉన్న సిబ్బందికి ఎటువంటి ప్రాణ హాని కలుగలేదని.. షిప్‌లో కూడా భారీ నష్టం కలుగలేదని అమెరికా అధికారులు తెలిపారు. ఈ దాడి తామే చేసినట్లు హౌతీ రెబెల్స్ ప్రకటించారు.

హౌతీ తిరుగుబాటుదారుల ప్రతినిధి యహ్య సరీ ఒక వీడియో ప్రకటనలో మాట్లాడుతూ.. ”అమెరికా, బ్రిటిష్‌కు చెందిన యుద్ధనౌకలు మా దేశంపై దాడి చేశాయి. “వారి యుద్ధ నౌకలను మేము టార్గెట్ చేస్తాం. అవి మా శత్రులక్ష్యాలు,” అని యహ్య సరీ చెప్పారు.

Advertisement

గత కొంతకాలంగా హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో వాణిజ్య కంటైనర్ షిప్‌లను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ మిసైల్స్‌తో దాడులు చేస్తున్నాయి. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఇజ్రాయెల్ ఆపేయాలని వారి డిమాండ్. హౌతీలను కట్టడి చేసేందుకు అమెరికా, బ్రిటన్ ఎర్రసముద్రంలో యుద్ధనౌకలను మోహరించాయి. ఇటీవల యెమెన్ దేశంలోని హౌతీ రెబెల్స్ ఆయుధ స్థావరాలపై అమెరికా, బ్రిటన్ వరుసగా దాడులు చేశాయి.

అయినా హౌతీ విద్రోహులు వెనక్కు తగ్గేది లేదని చెబుతున్నారు. గాజాలో అమాయక పౌరులను చంపుతున్న ఇజ్రాయెల్‌ని కట్టడి చేసేంత వరకూ దాడులు చేస్తూనే ఉంటామని.. ఇజ్రాయెల్‌ను సమర్థించే ఎవ్వరినీ వదిలేది లేదని హౌతీ రెబెల్స్ వార్నింగ్ ఇచ్చారు.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×