BigTV English

Sharmila : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు.. షర్మిలకు పగ్గాలు ఇచ్చే ఛాన్స్..

Sharmila : ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల పాత్రపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవలే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న ఆమె..పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపడుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. దేశంలో లోక్‌సభ ఎలక్షన్స్‌ కూడా జరగనున్న నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది హస్తం అధిష్టానం. కర్ణాటక, తెలంగాణలో మాదిరే ఏపీలోనూ విక్టరీ సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పజెప్తే.. పదేళ్లనాటి పూర్వవైభవం నెలకొంటుందని.. జగన్‌ను ఎదుర్కొవడం సులువు అవుతుందన్న అంచనాల్లో ఉంది. ఈ మేరకు త్వరలో షర్మిలను పీసీసీ చీఫ్‌గా నియమిస్తారన్న టాక్‌ వినిపిస్తోంది.

ఏపీలో వైఎస్‌ఆర్‌ హయాంలో కాంగ్రెస్‌ హవా నడించింది. ఆ తర్వాత టీడీపీ, వైసీపీల గాలికి హస్తం డీలా పడింది. దీంతో తమ పార్టీ ఉనికిని చాటుకోవడానికి తెలంగాణలో చక్రం తిప్పాలనుకున్న షర్మిలను ఏపీలో దించింది. షర్మిలకు పగ్గాలు అప్పగిస్తే.. ఒకనాటి వైఎస్‌ఆర్‌ అభిమానులంతా మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశముంటుందని.. తద్వారా అధికారం ఖాయమన్న భావనలో ఉంది అధిష్టానం. ఇక మరోవైపు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడగా ఉన్న గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఈ రెండ్రోజుల్లో షర్మిలను పీసీసీ చీఫ్‌గా నియమించే అవకాశముందని సమాచారం.

Related News

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Big Stories

×