E-Paper
Advertisement

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!
Advertisement

Rashmika Mandanna: రష్మిక మందన్న ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒకవైపు వరుస సినిమాలకు కమిట్ అయినటువంటి ఈమెకు ఇటీవల సినిమా షూటింగ్ సమయంలో భాగంగా ప్రమాదం చోటు చేసుకోవడంతో తన కాలికి గాయం అయింది తద్వారా సినిమా షూటింగులకు విరామం ప్రకటించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. రష్మిక నటిస్తున్న మైసా (Mysaa)సినిమా షూటింగ్ సమయంలో భాగంగా ఈమె కాలికి ప్రమాదం జరిగింది. దీంతో దాదాపు మూడు నెలల పాటు డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.

విజయ్ కోసమే గాయమయ్యిందేమో..

ఈ విధంగా రష్మిక కాలికి గాయం కావడంతో ఆమె ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ తన కుటుంబంతో తన సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కాస్త కోలుకోవడంతో రష్మిక రణబాలి సెట్స్ లోకి అడుగుపెట్టారు. అయితే తాజాగా ఈమె తనకు కాలికి గాయం కావడం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను తన భర్తతో కలిసి విలువైన సమయాన్ని గడపడం కోసమే తన కాలికి గాయం అయిందేమో అంటూ రష్మిక తెలిపారు. వరుస సినిమాలకు కమిట్ అవటంవల్ల పెళ్లి తర్వాత తాను విజయ్ దేవరకొండ దాదాపు మూడు నెలల పాటు ఒకరినొకరం చూసుకోలేదని తెలిపారు. నేచర్ నన్ను ప్రశాంతంగా ఇంట్లో కూర్చోబెట్టి మా ఇద్దరికీ ఈ క్వాలిటీ టైమ్ ఇచ్చిందేమో అనిపించిందని తెలిపారు

రష్మికపై విజయ్ ఫన్నీ కామెంట్..

Advertisement

ఇలా కాలికి గాయం కావడం వల్ల తన సమయం మొత్తం తన భర్తతో అలాగే కుటుంబ సభ్యులతో గడుపుతున్నానని తెలిపారు. ఈ చిన్న గ్యాప్ మా ఇద్దరికీ చాలా స్పెషల్ అని తెలియజేశారు. రష్మిక చేసిన ఈ వ్యాఖ్యల పట్ల విజయ్ దేవరకొండ కూడా స్పందిస్తూ.. ఇద్దరం ఇలా ఇంట్లో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది కానీ ఇకపై ఇలాంటి క్వాలిటీ టైం గాయాలు లేకుండా దక్కితే బాగుంటుంది అంటూ ఫన్నీగా మాట్లాడారు. ఇలా పెళ్లి తర్వాత తన భర్త, కుటుంబతో కలిసి రష్మిక ఈ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే రష్మిక విజయ్ దేవరకొండ జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రణబాలి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత విజయ రష్మిక మొదటి సినిమా..

ఈ సినిమా చివరిదశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16వ తేదీ విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారు. ఇటీవల ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయబోతున్నారు. వచ్చేవారం టీజర్ విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ టీజర్ కి సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా విజయ్ దేవరకొండ పూర్తి చేశారని టీజర్ విడుదలకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. విజయ్ రష్మిక జంటగా పెళ్లి తర్వాత నటించిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Also Read: సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×