E-Paper
Advertisement

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో
Advertisement

Ambati Rayudu On Bhuvneshwar Kumar :  టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్… రీ-ఎంట్రీ కోసం చాలా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రత్యర్ధిని వణికిస్తూ టీమ్ ఇండియాలో కీలక బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ కొనసాగగా… ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గాయం ఇతర సమస్యల కారణంగా టీమిండియా జట్టు నుంచి దూరమయ్యాడు. ఇక అప్పటి నుంచి రీ-ఎంట్రీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ భువనేశ్వర్ కుమార్ ను బీసీసీఐ సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు.

అత్యంత దారుణంగా అతనిని ట్రీట్ చేస్తున్నారు. ఐపీఎల్ అలాగే దేశవాళీ క్రికెట్లలో అద్భుతంగా గమనిస్తున్నప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదు. ఇలాంటి నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ కెరీర్ పై అంబటి రాయుడు హాట్ కామెంట్స్ చేశారు. వేచి చూడకుండా.. రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోవాలని అంబటి రాయుడుకు హితువు పలికారు. అతడు ఎంత కష్టపడ్డా… 1000 పొర్లు దండాలు పెట్టినా పట్టించుకునే నాథుడే ఉండకూడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

Advertisement

భువనేశ్వర్ కుమార్ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చే అంశంపై తాజాగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో టీమిండియాలో భువనేశ్వర్ కుమార్ కు అవకాశాలు రావడం కష్టమేనని తేల్చి చెప్పారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు అవకాశం కల్పించడంపై టీమిండియా యాజమాన్యం ఆసక్తి చూపించడం లేదని వ్యాఖ్యానించారు. అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ల‌ను పదేపదే పక్కన పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు అంబటి రాయుడు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Advertisement

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, పరిస్థితి చాలా వింతగా ఉందని వ్యాఖ్యానించారు. యువ క్రికెటర్లకు ప్రాధాన్యత ఇస్తూ సీనియర్ క్రికెటర్లను పట్టించుకోకపోవడం పై కూడా ఆగ్రహించారు. ప్రస్తుత సెలెక్టర్ల మూడ్ ప్రకారం 2027 వన్డే వరల్డ్ కప్ కోసం యువ క్రికెటర్ల కోసం బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇలాంటి క్రమంలో భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్లకు అన్యాయం జరుగుతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ లెక్క‌న‌ భువనేశ్వర్ కుమార్ కెరీర్ ముగిసినట్లేనని అనిపిస్తోందని బాంబు పేల్చారు.

టి20లలో అయినా అతనికి చోటు దక్కి చిన్నపాటి అవకాశం ఉండేది కానీ, అది కూడా జరగడం లేదని బిసిసిఐపై మండిపడ్డారు. టి20 సిరీస్ ల‌లో కూడా టీమిండియా యాజమాన్యం దాదాపు అదే కుర్ర క్రికెటర్ల వైపు మొగ్గు చూపి… భువనేశ్వర్ కుమార్ లాంటి సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో టీమిండియా తరఫున అద్భుతంగా రాణించి ఇటీవల ఐపిఎల్ లో కూడా మెరుగైన ప్రదర్శించాడు భువనేశ్వర్ కుమార్. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ టీమ్ రెండు సార్లు టైటిల్ ద‌క్కించుకోవ‌డం వెనుక భువీ ఉన్నార‌ని తెలిపారు. అయినప్పటికీ భారత జట్టు గడప కూడా తొక్కనివ్వడం లేదు బీసీసీఐ సెలెక్టర్లు. IPLలో బాగా ఆడినా ప‌ట్టించుకోవ‌డం స‌రైన నిర్ణ‌యం కాద‌న్నారు.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

 

 

 

Related News

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×