BigTV English
Advertisement

Food noise: నెక్ట్స్ ఏం తినాలో ముందే ప్లాన్ చేస్తున్నారా.. అయితే అది ఫుడ్ నాయిసే!

Food noise: నెక్ట్స్ ఏం తినాలో ముందే ప్లాన్ చేస్తున్నారా.. అయితే అది ఫుడ్ నాయిసే!

Food noise: కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలనో, జంక్ ఫుడ్ మానేయాలనో.. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలనో.. ఇలా ఏదో ఒక వ్యాపకంతో డైట్‌లో ఉన్నవాళ్లకి ఎంత వద్దనుకున్నా.. ఆహారం తినాలి అనిపిస్తుంటుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే.. పదే పదే మనసు ఆహారం వైపే మళ్లుతుంటుంది. ఈ హాబిట్‌నే ఇప్పుడు ‘ఫుడ్ నాయిస్’ అంటున్నారు. ఒకసారి తిన్నాక తర్వాత ఏం తింటే బాగుంటుంది అని ప్లాన్ చేయడం, తిన్నదాని గురించి పశ్చాత్తాప పడటం వంటివన్నీ ఫుడ్ నాయిస్ కిందకే వస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు.


మెదడులో ఆహార ఆలోచనలు:

చాలామంది భావోద్వేగాలు, ఒత్తిడిని అదుపు చేయడానికి ఆహారాన్నే మార్గంగా ఎంచుకుంటున్నారు. అనారోగ్యకరమైనా సరే నచ్చిన ఆహారం లాగించేస్తుంటారు. ఇదీ ఫుడ్ నాయిసే. నేటి యువత ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పక్కన పెట్టేయడం, జీవనశైలిలో మార్పుల వల్ల దీర్ఘకాలంలో అనారోగ్యాలు ఎదుక్కొంటున్నట్లు యూరోపియన్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది.

ప్రమాదంలో ఆరోగ్యం:

రోజులో ఎక్కువగా ఆహారం తీసుకుంటే.. శరీరానికి లభించే క్యాలరీల సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో ఉన్నట్టుండి వెయిట్ గెయిన్ అవ్వడం, హార్ట్‌ఎటాక్ రావడం వంటివి జరుగుతాయి. రుచిగా ఉంటాయని, తినడానికి సులువుగా ఉంటుందని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ని తీసుకుంటే.. ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలా చేస్తే.. ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.


నియంత్రణ మీ చేతుల్లోనే:

మంచి పోషకాలతో నిండిన ఆహారాన్ని రోజులో ఎంత తీసుకోవాలో మీరే ప్లాన్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఫుడ్ తీసుకోవాలనిపిస్తే.. మీ మైండ్‌ని డైవర్ట్ చేసేందుకు ఏదో ఒక పని చేస్తుండాలి. అనారోగ్యకరమైన ఆహారం తీసుకునే ముందు.. దాని వల్ల వచ్చే సమస్యలను గుర్తు చేసుకోండి. అప్పుడు తినాలన్న ఆసక్తి తగ్గుతుంది. ఈ లక్షణాలన్నీ మీకూ ఉన్నాయనిపిస్తే.. నియంత్రించే ప్రయత్నం చేయాలి.

సంపూర్ణ ఆరోగ్యానికి:

* మీ మెదడులో పదే పదే ఆహారం గురించే ఆలోచనలు వస్తుంటే.. ప్రొటీన్‌, ఫైబర్‌, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి.
* ఉదయాన్నే ఎక్కువ ప్రొటీన్‌ ఉన్న అల్పా హారం తినాలి. చీజ్‌, గుడ్లు, ప్రొటీన్‌ షేక్‌లు తీసుకోవటంవల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
* అస్తమానం ఆకలిగా అనిపిస్తే.. కార్బోహైడ్రేట్స్‌, కొవ్వు లేదా ప్రొటీన్‌ ఉన్న ఆహారాన్నే మాత్రమే తీసుకోవాలి.
* ప్రతిరోజూ ప్రమాదకరమైన రసాయనాలు కలిపిన ప్రొసెస్డ్‌ ఫుడ్‌ తినకూడదు.
* మన పేగుల్లో ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది తక్కువైతే.. ఆకలి వేస్తుస్తుంటుంది. కాబట్టి.. పెరుగు వంటివి ఎక్కువగా తినాలి.
* మెగ్నీషియం తక్కువైనప్పుడే చక్కెర తినాలనిపిస్తుంది. అందువల్ల మెగ్నీషియం ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవటం మంచిది.

Related News

Zumba Dance: బోరింగ్ వర్కౌట్స్‌తో విసుగొస్తుందా.. అయితే మ్యూజిక్ వింటూ స్టెప్పులేయండి!

Karivepaku Rice: కరివేపాకు రైస్ పావు గంటలో చేసేయొచ్చు, రెసిపీ చాలా సులువు

Trial Separation: విడాకులు తీసుకునే ముందు.. ఒక్కసారి ‘ట్రయల్ సెపరేషన్’ ప్రయత్నించండి!

Wasting Money: విలాసంతమైన కోరికలకు కళ్లెం వేయకుంటే.. మిమ్మల్ని చుట్టుముట్టే సమస్యలివే!

Crocs: క్రాక్స్ ఎందుకంత ఫేమస్?.. దీని వెనుకున్న ముగ్గురి స్నేహితుల కథేంటి?

Mumbai Style Vada Pav: ముంబై స్టైల్ వడా పావ్ రెసిపీ.. క్షణాల్లోనే రెడీ చేసుకోవచ్చు !

Jilebi Sweet Recipe:జ్యూసీ, క్రిస్పీ జిలేబీ.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు !

Big Stories

×