BigTV English

Iran 400kg Uranium Missing: ఇరాన్ 400 కిలోల యురేనియం మిస్సింగ్! ఇజ్రాయెల్-అమెరికాలో టెన్షన్ టెన్షన్

Iran 400kg Uranium Missing: ఇరాన్ 400 కిలోల యురేనియం మిస్సింగ్! ఇజ్రాయెల్-అమెరికాలో టెన్షన్ టెన్షన్

Iran 400kg Uranium Missing: 12 రోజుల భీకర యుద్ధం తర్వాత.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సీజ్‌ ఫైర్‌ అమల్లోకి రావడంతో.. రెండు దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అంతా అనుకున్నారు. బంకర్లలో దాక్కున్న పౌరులంతా బయటకు రావాలని రెండు దేశాలు ప్రకటించడంతో.. ఇక యుద్ధం ముగిసినట్లేనని భావించారు. పశ్చిమాసియాలో మళ్లీ శాంతి నెలకొంటుందనే చర్చ జరిగింది. కానీ.. ఇంతలోనే ఇరాన్‌పై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. నార్త్ టెహ్రాన్‌లో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి.


ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే మళ్లీ పేలుళ్లు

బబోల్సార్‌ ప్రాంతంలో వరుస పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. ట్రంప్ మాటను.. ఇజ్రాయెల్ లెక్క చేయనట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే మళ్లీ పేలుళ్లు జరగడం చూస్తుంటే.. యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా అనే అనుమానం కలుగుతోంది. ఇరాన్‌ రాడార్‌ వ్యవస్థపై.. ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పుడే.. ఏ క్షణంలోనైనా ఉద్రిక్తతలు చెలరేగొచ్చనే వాదనలు వినిపించాయ్. ఇంతలోనే.. ఇరాన్‌పై.. ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటంతో.. మళ్లీ పశ్చిమాసియాలో టెన్షన్స్ మొదలయ్యాయ్. ఈ పరిస్థితులు.. ఎక్కడికి దారితీస్తాయన్నది ఆందోళన రేపుతోంది.


ఈసారి ట్రంప్‌కు మించి అన్నట్లుగా స్టేట్‌మెంట్ రిలీజ్

అమెరికా దాడులు చేసిన తమ అణు కేంద్రాల్లో.. యురేనియమే లేదని.. ముందుగానే వాటిని వేరే చోటికి తరలించామని ఇరాన్ చెబుతోంది. అంతేకాదు.. ట్రంప్ ప్రాధేయపడితేనే తాము సీజ్ ‌ఫైర్‌కు అంగీకరించామని ప్రకటించింది. దాంతో.. అమెరికా షాక్ అయి షేక్ అయింది. నిజానికి.. ఇలాంటి ఊహించిన స్టేట్‌మెంట్స్ ట్రంప్ నుంచి వస్తుంటాయి. కొంత చేసి.. అంతా తానే చేశానని చెప్పుకోవడం ట్రంప్ స్టైల్. కానీ.. ఈసారి ట్రంప్‌కు మించి అన్నట్లుగా స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది ఇరాన్.

అణ్వాయుధాల విషయంలోనూ ఇరాన్ కీలక కామెంట్స్

అణ్వాయుధాల విషయంలోనూ ఇరాన్ కీలక కామెంట్స్ చేసింది. తమ దగ్గర న్యూక్లియర్ బాంబులే లేనప్పుడు.. ఇజ్రాయెల్, అమెరికా ఎందుకు దాడి చేశాయో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. అంతర్జాతీయ చట్టాలను ఈ రెండు దేశాలు గౌరవించవా? అని నేరుగా ప్రశ్నిస్తోంది. ఇరాన్ తీరు చూస్తుంటే.. యుద్ధం తర్వాత మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. ఇదెంతవరకు కొనసాగుతుందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

ఇరాన్ 400 కిలోల యురేనియం మిస్సింగ్!

మరోవైపు.. అమెరికా దాడుల తర్వాత ఇరాన్‌లో 400 కేజీల యురేనియం మిస్‌ అయ్యిందనే సమాచారం టెన్షన్ పుట్టిస్తోంది. ఈ యురేనియంతో 10 న్యూక్లియర్‌ బాంబులను తయారు చేయవచ్చు. నిజానికి అమెరికా దాడులకు ముందే అక్కడి నుంచి కీలకమైన పరికరాలను, శుద్ధి చేసిన యురేనియాన్ని తరలించారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడీ వాదనలకు బలం చేకూర్చేలా వ్యాఖ్యలు చేసింది అమెరికా. ఫోర్దోతో పాటు ఇస్ఫాహన్, నతాంజ్‌ న్యూక్లియర్ సెంటర్ల నుంచి యురేనియం నిల్వలను ముందే ఇరాన్ తరలించినట్టు తెలుస్తోంది. వీటిని ఓ సీక్రెట్ లొకేషన్‌కు తరలించినట్టు తెలుస్తోంది. అది కూడా ఇస్ఫాహాక్‌ ఏరియాలోని అత్యంత పురాతనమైన అండర్‌గ్రౌండ్‌ బంకర్‌ అని అనుమానిస్తున్నారు. ఇరాన్‌ మళ్లీ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం కనిపిస్తోంది.

Also Read: పామును నమ్మండి, కానీ పాకిస్తాన్‌‌ను కాదు.. ఇరాన్‌కు వెన్నుపోటుపై ఫన్నీ మీమ్స్

ఇప్పుడు అగ్రరాజ్యం టోన్ మారుతోందా?

తమ దాడులు సక్సెస్ అయ్యాయని.. ఇరాన్ న్యూక్లియర్ ప్రొగ్రామ్‌కు బ్రేక్ పడిందంటూ అమెరికా చెప్పుకొచ్చింది. కానీ.. ఇప్పుడు అగ్రరాజ్యం టోన్ మారుతోంది. దాడులతో తమకు నష్టం జరిగింది నిజమే అయినప్పటికీ.. తమ న్యూక్లియర్ ప్రొగ్రామ్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తేల్చి చెప్పింది ఇరాన్. మిస్సైన 400 కేజీల యురేనియం నిల్వలను 60 శాతం శుద్ధిగా అనుమానిస్తున్నారు. మరో 30 శాతం శుద్ధి చేస్తే వాటితో అణుబాంబులను తయారు చేయవచ్చు. నిజానికి అమెరికా దాడులు చేయడానికి ముందు ఫోర్దో న్యూక్లియర్ సెంటర్‌ వద్ద భారీ ట్రక్కులు, యంత్రాలు కనిపించాయి. వీటిలోనే ఆ యురేనియాన్ని తరలించారనే అనుమానాలు ఉన్నాయి.

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×