Intinti Ramayanam Today Episode june 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య ఆడుకోడానికి ఆ వీధిలోని పిల్లల దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న పిల్లలు మీ అమ్మానాన్న ఎవరో చెప్పు అని మాట్లాడుతారు దాంతో ఆరాధ్యకు కోపం వచ్చి ఒక పిల్లని చంప పగలగొడుతుంది. వాళ్ల పేరెంట్స్ అక్షయ్ దగ్గరికి తీసుకొని వస్తారు. తుని ఇలానే నా పెంచేది మీ ఆవిడ ఎక్కడ బయటకు తీసుకురండి నేను మాట్లాడుతాను అని అవతల ఆవిడ అనడంతో అక్షయ్ అవని దగ్గరకు తీసుకొని వెళ్తాడు. నీ దగ్గర ఉంటే ఆరాధ్య ఎలా తయారవుతుందో చూసావా ఇంటి మీదకి గొడవలు తీసుకుని వచ్చింది అని అక్షయ్ అంటాడు. కూతుర్ని ఎలా పెంచాలో నాకు తెలుసు మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని అవని అక్షయ్ కి రివర్స్లో షాక్ ఇస్తుంది. రాజేంద్రప్రసాద్ ఏమో తన కొడుకు కోడలు విడిపోవడానికి గల కారణాలను వాళ్ళకి వివరిస్తారు.. పార్వతి ఏం చెప్పినా కూడా ఎప్పుడు మౌనంగా ఉండే అవని ఈ ఘటనతో సీరియస్ అయిపోయింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ తో సంతకం చేయించిన వ్యక్తిని చూసి ఫాలో అవుతూ అవని శ్రీకర్ చక్రధర్ ఇంటికి వెళ్తారు. కచ్చితంగా చక్రధర్ మనిషి అని అభిప్రాయానికి వస్తారు.. అసలు వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు వీడియో తీయాలని అనుకుంటారు. ఇది ఇద్దరు కలిసి కిటికీలోంచి చక్రధర్ మాటల్ని రికార్డ్ చేస్తారు. అక్షయ్ తో సంతకాలు పెట్టించుకోవడానికి మేము చాలా రిస్క్ చేశామని పర్సంటేజ్ ను పెంచాలని అతను అడుగుతాడు. అయితే వీడియో అయితే రికార్డు అవుతుంది కానీ ఆడియో రికార్డ్ అవ్వలేదు వదినా అని శ్రీకర్ అంటాడు. మనం నేరుగా వెళ్లి వాళ్ళతో తేల్చుకుంటే అసలు సంగతి ఏంటో తెలిసిపోతుంది కదా అని శ్రీకర్ అంటాడు.
అవని కూడా లోపలికి వెళ్లి తేల్చుకుందామని ఇద్దరు కలిసి వెళ్లిపోతారు. అయితే లోపలికి వెళ్ళగానే అక్కడ ఆ వ్యక్తి కనిపించకుండా వెళ్ళిపోతాడు. అవని మీరు మమ్మల్ని మోసం చేసిన వ్యక్తితో డీల్ కుదుర్చుకోవాలని ఏదేదో ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్లతో మీరు పెట్టుకుంటే మీకే నష్టమని అంటుంది. చక్రధర్ అవని దగ్గర్నుంచి తృటిలో తప్పించుకుంటాడు.. అవని మాత్రం అతనిపై అనుమానంతో ఇళ్లంతా వెతకమని శ్రీకర్తో చెబుతుంది. శ్రీకర్ ఇల్లంత వెతికిన ఆ వ్యక్తి కనిపించడు. నా దగ్గరికి ఎవ్వరూ రాలేదని చెప్పినా మీరు నమ్మలేదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చక్రధర్ అంటాడు.
Also Read: ప్రభావతికి అడ్డంగా దొరికిన రోహిణి.. దిమ్మతిరిగే షాకిచ్చిన బాలు..
అయితే చక్రధర్ ఏదో దాస్తున్నాడని అనుమానం తోనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. బయటికి రాగానే రాజేశ్వరి ఎదురుగా వస్తుంది. అమెరికా నుంచి వెళ్లొచ్చాలోగా ఇన్ని జరిగాయని అన్ని విషయాలను అవని ద్వారా తెలుసుకుంటుంది.. ఇప్పుడు పరిస్థితులు బాగా లేవు పిన్ని గారు ఇంకొకసారి మీతో మాట్లాడతామని అక్కడినుంచి అవని శ్రీకర్ వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళగానే చక్రధర్ను రాజేశ్వరి చెడామడా తిట్టేస్తుంది. నీ కూతుర్ని కాపురానికి పంపిన ఇంటిని నువ్వు నాశనం చేయాలని చూస్తావా..? మనకేం తక్కువైందని నువ్వు వాళ్ల మీద పడ్డావు అని అరుస్తుంది. చక్రధర్ మాత్రం ఆమె నోరు మూయిస్తాడు.
ఇక తర్వాత పల్లవి పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే నుంచే అత్తయ్య బావగారు అంటూ కేకలు వేస్తుంది.. అది విన్న రాజేంద్రప్రసాద్ ఏం జరిగిందో అని బయటకు వస్తాడు. పల్లవి రాగానే పెద్దగా కేకలు వేసింది. ఆ మాట వినగానే అందరు కంగారు పడుతూ బయటకు వస్తారు. పెద్ద కోడలు ఏం చేసిందో తెలుసా అత్తయ్య అనేసి అడుగుతుంది. ఏం చేసింది అని అందరూ అడుగుతారు. మా ఇంటికి వెళ్లి మా నాన్నతో తప్పుగా మాట్లాడింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో చక్రధర్ గురించి అవని అందరితో చెప్తుందేమో చూడాలి..