Sreedhar Son Missing: ప్రముఖ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్ రెడ్డి తాజాగా తన కొడుకు మిస్ అయినట్టు పోలీసులను ఆశ్రయించారు. అసలు విషయంలోకి వెళ్తే.. అట్లాంటాలో ఉంటున్న ఒక తెలుగు యువకుడు ఇటీవల మిస్ అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జూన్ 22న తనకు ఎయిర్పోర్ట్ నుంచి వీడియో కాల్ చేసి మాట్లాడాడని, ఆ తండ్రి వెల్లడించారు. ఆ తండ్రి ఎవరో కాదు నటుడు శ్రీధర్ రెడ్డి (Sreedhar Reddy). ఈ వీడియో కాల్ తర్వాత తన కొడుకు నుంచి ఎలాంటి కాల్, మెసేజ్ రాలేదు అని, తన కొడుకు మొబైల్ ఎయిర్పోర్టులోనే మిస్ అయినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే ఫోన్ మిస్ అయ్యితే ఇంకో ఫోన్ నుంచి అయినా ఫోన్ చేయాలి కదా.. అలా కూడా చేయలేదని, కాబట్టి తన కొడుకు మిస్ అయ్యాడు అని, కన కొడుకు జాడ కనిపెట్టాలి అని శ్రీధర్ రెడ్డి పోలీసుల ముందు కన్నీటి పర్యంతమవుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి, తన కొడుకు జాడ కనిపెట్టాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శ్రీధర్ రెడ్డి కెరియర్..
ప్రముఖ నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీధర్ రెడ్డి పుష్ప 2 సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా చాలా సినిమాలలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించిన ఈయన 2019లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2025 వరకు కేవలం ఆరేళ్లలో సుమారుగా 50 కి పైగా చిత్రాలలో నటించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తనకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కోరిక చాలా బలంగా ఉంది అని, అయితే తన కోరికను ఇలా సినిమాల ద్వారా కూడా తీర్చుకుంటున్నాను అంటూ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇకపోతే అన్ని సినిమాలలో కూడా నాకు ఇలా పోలీస్ ఆఫీసర్ పాత్రలు రావడానికి కూడా కారణం బహుశా నేను ఆ పాత్రకు సెట్ అవుతానేమో అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా శ్రీధర్ తెలిపిన విషయం తెలిసిందే.
శ్రీధర్ రెడ్డి సినిమాలు..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujeeth)దర్శకత్వంలో వస్తున్న ఓ జి సినిమాలో నటుడిగా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కాబోతోంది.
స్నేహం కంటే బంధాలే ఎక్కువ..
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీధర్ రెడ్డి ఇండస్ట్రీలో స్నేహం కంటే రిలేషన్ షిప్స్ చాలా బలంగా ఉంటాయని, ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటారని, ప్రతి విషయంలో కూడా అండగా ఉంటారని తెలిపారు. ఇక అలాంటి ఈయనకు ఇప్పుడు కొడుకు మిస్ అయిన సంఘటన మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రభుత్వం కలగజేసుకొని ఆయన కొడుకు జాడ కనిపెడతారో లేదో చూడాలి.