BigTV English

Pakistan Deceive Iran: పామును నమ్మండి, కానీ పాకిస్తాన్‌‌ను కాదు.. ఇరాన్‌కు వెన్నుపోటుపై ఫన్నీ మీమ్స్

Pakistan Deceive Iran: పామును నమ్మండి, కానీ పాకిస్తాన్‌‌ను కాదు.. ఇరాన్‌కు వెన్నుపోటుపై ఫన్నీ మీమ్స్

Pakistan Deceive Iran| ఇరాన్, పాకిస్తాన్ రెండూ ముస్లిం దేశాలు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ.. పాకిస్తాన్ ఇంతకాలం ఇరాన్ తమ సోదర దేశమని చెబుతూ వచ్చింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడులను ఖండించింది కూడా. అయితే అదే ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తే.. ఆ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేరుని నోబెల్ శాంతి పురస్కారానికి సిఫార్సు చేసింది. పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి పట్ల సోషల్ మీడియా యూజర్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా.. పాకిస్తాన్ పౌరులే తమ దేశాధినేతలను తప్పుపడుతున్నారు.


ఇరాన్-పాకిస్థాన్ మధ్య ఎలాంటి సంబంధాలున్నాయి?
ఇరాన్, పాకిస్థాన్ సరిహద్దును పంచుకుంటాయి. ఇస్లామిక్ వారసత్వం, చారిత్రక వాణిజ్య మార్గాలను కలిగి ఉన్నాయి. ఇరు దేశాలు ఇజ్రాయెల్‌ చర్యలను వ్యతిరేకిస్తున్నాయి. గాజా స్ట్రిప్, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ చర్యలను తప్పుబడతాయి. ఇటీవల, రెండు దేశాల నాయకులు సమావేశమై.. హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్స్ జరిపాయి. బలోచిస్తాన్ విషయంలో రెండు దేశాల మధ్య సరిహద్దు గొడవలున్నాయి. రెండు దేశాల సరిహద్దు రాష్ట్రాల్లో బలోచ్ సంస్కృతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఈ సమస్య వల్ల ఇరు దేశాలు కొన్ని సార్లు ఘర్షణ పడినప్పటికీ.. చివరికి సామరస్యంగానే పరిష్కరిస్తూ వచ్చాయి.

అందుకే పాకిస్తాన్.. ఇరాన్ తమ మిత్ర దేశమని చెబుతోంది. కానీ అమెరికా ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. పాకిస్తాన్ వంగి దండాలు పెడుతుంది. అమెరికా చెప్పిందే వేదమని నీతులు కూడా చెబుతుంది. అందుకే ఇరాన్ పై అమెరికా దాడులు చేయగానే.. ఒకవైపు దాడులను ఖండిస్తూ .. అమెరికా ప్రెసిడెంట్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలని సిఫారసు చేసింది.


సోషల్ మీడియాలో పాకిస్తాన్ వైఖరిపై ట్రోలింగ్
పాకిస్థాన్ రెండు విరుద్ధ వైఖరుల గురించి సోషల్ మీడియాలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. ట్విట్టర్ ఎక్స్ లో అయితే.. యూజర్లు పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టారు. మోహిత్ చౌహాన్ (@mohitlaws) అనే యూజర్ ఇలా రాశారు.. “అమెరికా అధ్యక్షుడితో పాకిస్తాన్ ఆర్మీ జెనెరల్ భోజనం చేశారు, వారి ఎయిర్‌బేస్‌లను ఉపయోగించడానికి అనుమతించారు. ట్రంప్‌ను నోబెల్ బహుమతికి సిఫారసు చేశారు, ఇప్పుడు అమెరికా దాడులను ఖండిస్తున్నారు. పామును నమ్మొచ్చు, కానీ పాకిస్థాన్‌ను ఎప్పటికీ నమ్మొద్దు.”

రాజకీయ విశ్లేషకుడు డెరెక్ జె.గ్రాస్‌మన్ (@DerekJGrossman) కూడా ఇలాగే వ్యాఖ్యానించారు. “పాకిస్తాన్ ని అమెరికా ఎప్పుడూ వాడుకుంటుంది. పైకి పాకిస్తాన్ మాత్రం ఇదంతా తనకు ఇష్టం లేదంటుంది. కానీ మళ్లీ అదే జరిగినట్లు కనిపిస్తోంది,” అని వ్యంగ్యంగా పేర్కొన్నారు.

పాకిస్తాన్ గగనతలం నుంచే ఇరాన్‌పై అమెరికా దాడులు చేసిందా?
ఇరాన్‌పై అమెరికా దాడులకు పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగించిందనే నిరాధార ఆరోపణలు సోషల్ మీడియాలో మీమ్స్‌కు దారితీశాయి. పాకిస్థాన్ అధికారులు ఈ ఆరోపణలను “పూర్తిగా నిరాధారమని” అని తిరస్కరించారు.

అమెరికా దాడులను ఖండించిన పాకిస్థాన్ ఫారిన్ మినిస్టర్
ఆదివారం.. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ అమెరికా దాడులను ఖండిస్తూ.. ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ దాడులు “అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించాయి” అని, “ఇరాన్‌కు స్వీయ రక్షణ హక్కు ఉంది” అని చెప్పారు. ఈ పరిణామాలు “ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచవచ్చు” అని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాన్ని.. ముఖ్యంగా మానవతా చట్టాన్ని పాటించాలని, సంక్షోభాన్ని పరిష్కరించడానికి దౌత్యం, చర్చలు మాత్రమే మార్గమని ఇషాక్ డార్ నొక్కి చెప్పారు.

నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు
కానీ ఇషాక్ డార్ ఖండనకు ముందు.. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్.. ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు చేశారు. 2025లో భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో ట్రంప్.. “దౌత్యపరంగా నాయకత్వం, వ్యూహాత్మక దూరదృష్టి” కారణంగా మే 10న విరామ ఒప్పందం కుదిరిందని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రశంసించింది. ట్రంప్ తాను ఈ బహుమతికి అర్హుడినని చెప్పుకున్నారు. కానీ లిబరల్ పక్షపాతం కారణంగా దానిని పొందలేనని వాపోయారు.

Also Read: విజయంపై ఇరాన్, ఇజ్రాయెల్ ప్రకటనలు.. ఏం సాధించారు?

ఏది ఏమైనా.. అమెరికా నాయకత్వాన్ని ఒకవైపు ప్రశంసించడం, మరోవైపు ఇరాన్ విషయంలో దాన్ని ఖండించడం రెండూ చేస్తుండడం వెంట వెంటనే జరగడంతో ఈ మార్ప పట్ల పాక్ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ ఇదంతా పాకిస్తాన్ తమ దౌత్య విధానంలో సమతుల్యత కోసం చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×