Iran War: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి రెండో నెలలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధంలోకి హౌతీలు ఎంట్రీ ఇచ్చారు. దీంతో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇరాన్-హౌతీలు జత కలిస్తే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని చెబుతున్నాయి.
పశ్చిమాసియా యుద్ధం న్యూ టర్న్
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నెల రోజులు గడిచింది. యుద్ధం ఇప్పుడు రెండో నెలలోకి ప్రవేశించింది. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఇదే సమయంలో పశ్చిమాసియా యుద్ధంలోకి ఇరాన్ మద్దతు ఉగ్రవాద సంస్థ హౌతీలు ఎంటరయ్యారు. శనివారం వేకువజామున ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డారు.
ఇరాన్-అమెరికా యుద్ధం మొదలైన తర్వాత హౌతీలు చేసిన తొలి దాడి ఇదే. యుద్ధం ఆగే వరకు దాడులు కొనసాగుతాయని హౌతీ సైనిక అధికార ప్రతినిధి యాహ్యా సరీ తెలిపారు. దక్షిణ ఇజ్రాయెల్‌లో సైనిక స్థావరాలపై శనివారం బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించింది హౌతీ. ఈ విషయాన్ని హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ తెలిపారు.
హౌతీలు ఎంట్రీ.. ఎర్రసముద్రంలో కొత్త టెన్షన్
యెమెన్ దేశంలోని పశ్చిమప్రాంతాన్ని హౌతీల నియంత్రణలో ఉంది. అక్కడి నుంచి 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో ఇజ్రాయెల్‌పై రెండు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది హౌతీ. ఇరాన్ అనుకూలంగా ఉన్న పాలస్తీనా, లెబనాన్, ఇరాక్ మద్దతుగా పోరాటాన్ని కొనసాగిస్తామని హౌతీ ప్రతిజ్ఞ చేసింది.
యెమెన్‌లోని పశ్చిమభాగం హౌతీలకు స్వయంప్రతిపత్తి, అధికారాలు ఉన్నాయి. అంతేకాదు బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో కూడిన శక్తివంతమైన ఆయుధ కార్మాగారాన్ని నిర్మించుకుంది. వారికి ఇరాన్ నుంచి మద్దతు పుష్కలంగా ఉందని అమెరికా- ఇజ్రాయెల్ మద్దతుదారులు బలంగా నమ్ముతున్నారు.
ALSO READ: కువైట్, దుబాయ్ పోర్టులపై క్షిపణి వర్షం.. అమెరికా సైనికుల మృతి
చమురు రవాణాలో ప్రపంచంలో ఐదో వంతుకు హోర్ముజ్ జలసంధి ద్వారా రాకపోకలు జరుగుతున్నాయి. అక్కడ ప్రస్తుతం ఇరాన్ అడ్డుకుంది. ఈ తరుణంలో హౌతీ ఎంట్రీతో మరొక జలసంధికి కష్టాలు తప్పవనే భయాలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. బాబ్ అల్-మండేబ్ జలసంధిని దిగ్బంధించడం ద్వారా హౌతీలు మళ్లీ ఎర్ర సముద్ర రవాణాకు అంతరాయం కలిగిస్తుందనే భయాలు లేకపోలేదు.
ఇజ్రాయెల్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని హౌతీలు చూస్తున్నారని, వారి వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగించాలన్నది ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు నిపుణులు. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12 శాతం జరిగే ఎర్ర సముద్ర తీరంలో బాబ్ ఎల్-మండేబ్ జలసంధి ద్వారా జరుగుతుంది. ఆ ప్రాంతంలో హౌతీలు బలంగా ఉండడంతో నౌకలను లక్ష్యంగా చేసుకుంటే మరింత నష్టం కలిగించవచ్చని అంటున్నారు.
పశ్చిమాసియా యుద్ధంలోకి హౌతీలు
ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడులు
సౌదీలోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి
15 మంది సైనికులకు గాయాలు, విమానాలు ధ్వంసం
టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
లెబనాన్‌పై దాడుల్లో పలువురు మృతి
Houthis enter the Western Asia conflict, carrying out… pic.twitter.com/T48QF3UR4s
— BIG TV Breaking News (@bigtvtelugu) March 29, 2026