E-Paper
Advertisement

Iran: ఇస్లామాబాద్ శాంతి చర్చలు.. ఇరాన్ వెర్షన్ ఏంటి? చర్చల విఫలం వెనుక అదే కారణమా?

Iran: ఇస్లామాబాద్ శాంతి చర్చలు.. ఇరాన్ వెర్షన్ ఏంటి? చర్చల విఫలం వెనుక అదే కారణమా?
Advertisement

Iran: ఇస్లామాబాద్ శాంతి చర్చలపై అమెరికా తన వైపు వెర్షన్ చెప్పింది. మరి ఇరాన్ ఏమంది? ఎలాంటి అంశాలను తెరపైకి తెచ్చింది? ఇంతకీ చర్చల్లో పాల్గొన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఏమన్నారు? ఇరాన్‌కు దౌత్యపరమైన విజయమని ఆయన ఎందుకన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ఇస్లామాబాద్ శాంతి చర్చలు వ్యవహారం

Advertisement

ఇస్లామాబాద్ శాంతి చర్చల్లో అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని వెల్లడించింది ఇరాన్‌. ఆ దేశం మితిమీరిన డిమాండ్ల వల్ల ఒప్పందం కుదరలేదని తెలిపింది. చర్చల తర్వాత వివాదాస్పద అంశాలు లేవనెత్తారని పేర్కొంది. హోర్మూజ్‌ జలసంధి, అణు హక్కుల వంటి వివాదస్పద అంశాలు అమెరికా ప్రస్తావించిందని తెలిపింది.

వాటి గురించి ఏమీ తేలకుండానే అమెరికాతో చర్చలు ముగిశాయని పేర్కొంది. ఏ శక్తి ఎవరి చేతిలో ఉందో ప్రపంచం ఇప్పటికే చూసిందని, 11 ట్రిలియన్ రియాల్స్ విలువైన ఇరాన్ ఆస్తులపై అమెరికా విధించిన ఆంక్షలను తొలగిస్తే తప్ప హోర్ముజ్ జలసంధిని తెరవదని పేర్కొంది. చర్చల సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి దూకుడుగా మాట్లాడినట్టు తెలుస్తోంది.

Advertisement

దౌత్య పరమైన విజయమన్న ఇరాన్, నిర్ణయం తీసుకోవాల్సింది అమెరికానే

రాజకీయ, సైనిక, శాంతియుత అణు రంగాలలో ఇరాన్ ప్రాథమిక హక్కులను గట్టిగా సమర్థించారు ఆదేశ విదేశాంగ మంత్రి.  1979లో అమెరికా-యూరప్-జపాన్-దక్షిణ కొరియాలో ఇరాన్ ఆస్తులను స్తంభింప జేశాయని వివరించింది. నాలుగున్నర దశాబ్దాలుగా ఆయా ఆస్తుల విలువ 11 ట్రిలియన్ రియాల్స్‌కు పెరిగింది. ఈ విషయంలో ఇరాన్‌కు దౌత్యపరమైన విజయం సాధించిందని అంటోంది. ముఖ్యంగా హార్మూజ్‌ జలసంధిపై ఆధిపత్యం తమకే ఉండాలని, దాన్ని వదిలే ప్రసక్తే లేదని ఇరాన్‌ తేల్చి చెప్పింది.

మరోవైపు ఇరాన్‌ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి ఏ మాత్రం వీల్లేదని డిమాండ్‌ చేస్తోంది అమెరికా. యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్‌ వెంటనే ఆపాలని, ఇప్పటివరకు శుద్ధి చేసిన నిల్వలను మాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. హార్మూజ్‌ జలసంధి ద్వారా స్వేచ్ఛాయుత నౌకా వాణిజ్యానికి వీలు కల్పించాలని, విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకోరాదన్నది అమెరికా డిమాండ్.

ALSO READ: ఇస్లామాబాద్‌లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు.. చెడువార్త అంటూ జేడీవాన్స్ ప్రకటన 

ఈ నేపథ్యంలో ఇరాన్-అమెరికా దేశాలు ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తాయనేది ఆసక్తికరంగా మారింది.  ప్రతినిధులు చెప్పిన విషయాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్,  మరో 24 గంటల్లోగా రియాక్ట్ కావచ్చని అంటున్నారు. ఇప్పటికే చర్చలు అర్థాంతరంగా ముగిసిన విషయం ఆయనకు తెలిసి ఉంటుందని చెబుతున్నారు.

 

 

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×