E-Paper
Advertisement

Janasena Controversy: త్రిసభ్య కమిటీ విచారణ తుస్సేనా.. జనసేన ఎమ్మెల్యేలపై సేనాని మౌనం ఎందుకో..!

Janasena Controversy: త్రిసభ్య కమిటీ విచారణ తుస్సేనా.. జనసేన ఎమ్మెల్యేలపై సేనాని మౌనం ఎందుకో..!

Janasena Controversy: రెండు నెలలుగా రోజుకో వీడియోతో అటు జనసేనలో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టించిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం అటకెక్కిందా?.. తప్పు చేస్తే ఎవరైనా చర్యలు తీసుకుంటాం అని చెప్పే సేనాని తమ ఎమ్మెల్యే లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో ఎందుకు సైలెంట్ అయ్యారు? అసెంబ్లీ సాక్షిగా ఉన్న గలీజు వీడియోలు .. కారులో షికారు సాక్ష్యాలు.. గంట గంటకు వీడియో కాల్స్ నిర్వాకం.. త్రిసభ్య కమిటీ విచారణ అంటూ చేసిన హడావిడి అంతా తుస్సేనా? అంటే ఔననే సమాధానం వస్తోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించినా అరవ శ్రీధర్ తాజాగా పార్టీ కార్యక్రమం లో ప్రత్యక్షమయ్యారు. దాంతో పవన్ కళ్యాణ్ అంటే ఎమ్మెల్యేకి లేదా? అని జనం నిలదీసే పరిస్థితి తెలెత్తింది. ఇంతీకీ అరవ శ్రీధర్ వ్యవహారానికి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు?

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం

ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పేరు రెండు నెలలుగా జనసేన రాజకీయాల్లో పుట్టించిన కలకలం అంతా ఇంతా కాదు.. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ హోదాలో ఉంటూ పంచాయితీ రాజ్ శాఖలో చిన్న ప్రభుత్వ మహిళా ఉద్యోగిని లైగింక వేధింపులకు గురి చేశారని ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. సదరు బాధిత మహిళ, ఎమ్మెల్యే లీలపై వీడియో, ఆడియో టేపులు బహిర్గం చేస్తూ.. గుప్పించిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయి. దాంతో ఇరకాటంలో పడ్డ జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అరవ శ్రీధర్‌ని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ… ఆయనపై విచారణకు త్రిసభ్య కమిటీ నియమించారు. పార్టీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ రైల్వేకోడూరు వచ్చి విచారణ పేరుతో హడావిడి చేయడంతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఇక చర్యలు తప్పవని అందరు బావించారు. అయితే రెండు నెలలు గడిచినా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎలాంటి చర్యలు లేకపోవడంతో, ఇక ఎమ్మెల్యే సైతం బయటకు వచ్చి మెల్లగా పబ్లిక్ లో తిరగడం ప్రారంభించారు. వారం క్రితం ముక్కా రూపానందరెడ్డి ట్రస్ట్ ఆధ్యర్యంలో బస్ షెల్టర్ ప్రారంభోత్సవంలో సామాన్యుడిలా పాల్గొన్నారు. తర్వాత ఆయన ఇక తనకు ఏం కాదనే ధీమాతో.. డైరెక్ట్ గా జనసేన కండువాతో వర్షాలకు నేలకూలిన పంటలను, ఎమ్మెల్యే హోదాలో పరీశీలించి, నష్టపరిహారం చెల్లించేలా చూడాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు.

Also Read: Vahan Portal: వాహనాదారులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో నేటి నుండి వాహన్ పోర్టల్ ప్రారంభం

ఎమ్మెల్యే అరవ లైంగిక వేధింపుల్లో..

జనసేన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలిచ్చినా.. అలా అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా తన హడావుడి మొదలుపెట్టడంతో.. ఆయన వ్యవహారం మళ్ళీ హాట్ టాపిక్ గా మారిందట. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే పార్టీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ వేయడం, కమిటీ నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సేనాని ఆదేశించడం ఒక ఎత్తైతే, విచారణ కమిటి నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే ఎమ్మెల్యే హోదాలో ఎలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని బాధిత మహిళా ఉద్యోగిని ప్రశ్నిస్తుండటం తిరిగి కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం మళ్ళీ తెరపైకి రావడం ఎమ్మెల్యే పై చర్యలు ఉంటాయా? ఉండవా? అన్న సందేహం జనసైనికుల్లోనే వ్యక్తమవుతోందంట. ఈ ఏడాది జనవరిలో మొదలైన ఎమ్మెల్యే అరవ లైంగిక వేధింపుల ఆరోపణల పర్వం రెండు నెలలుగా రోజుకో వీడియో రచ్చ రేపింది. బాధిత మహిళ ఉద్యోగిని ఫిర్యాదుతో ఎమ్మెల్యే పై కేసు నమోదైంది. మరోవైపు ఎమ్మెల్యే తల్లి ఫిర్యాదుతో మహిళా ఉద్యోగినిపై కేసు నమోదు చేశారు.. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కేసులు పెట్టుకోవడం.. తర్వాత బెయిల్ మంజూరవ్వడం జరిగిపోయాయి.. ఇదంతా రెండు నెలలుగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించినా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మరింత ఆసక్తి రేపుతున్నాయట.

శ్రీధర్ మళ్ళీ జనసేన కండువాతో..

ఎమ్మెల్యే పై త్రిసభ్య కమిటీ విచారణ పేరుతో హడావిడి చేసినా, ఆ తర్వాత కమిటీ సభ్యులు అరవ శ్రీధర్‌కి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలతో, విచారణ కమిటీ అసలు అధిష్టానానికి ఏం నివేదించనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే పై ఇక చర్యలు ఉండవనే సంకేతాలు ఇచ్చిన తర్వాతనే అరవ శ్రీధర్ మళ్ళీ జనసేన కండువాతో మళ్ళీ యాక్టివ్ అయ్యారన్న టాక్ వినిపిస్ోంది. అసెంబ్లీ సమావేశాలకు, జనసేన ఆవిర్బావ వేడుకలకు దూరంగా ఉన్న అరవ శ్రీధర్ పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే .. కార్యక్రమాల్లో దైర్యంగా ఎలా పాల్గొంటారంటున్నారు. అయితే అరవ శ్రీధర్ జనంలోకి రీఎంట్రీ ఇస్తుండటంతో .. బాధిత మహిళ ఈసారి ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ పైనే కురిపించిన ప్రశ్నల వర్షం మళ్ళీ పార్టీని ఇరకాటంలోకి నెట్టేసిందట.. అరవ శ్రీధర్‌పై త్రిసభ్య కమిటీ రెండు నెలల పాటు జరిపిన విచారణ నివేదిక ఏమైందని? అసలు చర్యలు ఉంటాయా ఉండవా? అని ఆమె ప్రశ్నించడంతో … ఇక తప్పక ఏదో విషయం ప్రకటించడానికి జనసేన పెద్దలు నిర్ణయించుకున్నారని అంటున్నారు.. మరి ఆ చర్యలు ఎలా ఉంటాయో? టీడీపీ తరహాలో జనసేన సైతం ఎగ్రసివ్‌గా యాక్షన్ తీసుకుంటుందో? లేదో చూడాలి.

Storey By: Appa Rao

Powerful Military Drones: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర డ్రోన్.. రెప్ప పాటులో శత్రువు నాశనం

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×