BigTV English

Israel Agents | డాక్టర్ల వేషంలో ఇజ్రాయెల్ ఏజెంట్స్.. ఆస్పత్రిలో ముగ్గురు పాలస్తీనా పౌరుల హత్య!

Israel Agents | పాలస్తీనా భూభాగమైన వెస్ట్ బ్యాంక్‌లో మంగళవారం ఇజ్రాయెల్ గూఢాచారులు డాక్టర్ల వేషంలో ఓ ఆస్పత్రిలో చొరబడి ముగ్గురు పాలస్తీనా పౌరులను కాల్చి చంపారు.

Israel Agents | డాక్టర్ల వేషంలో ఇజ్రాయెల్ ఏజెంట్స్.. ఆస్పత్రిలో ముగ్గురు పాలస్తీనా పౌరుల హత్య!

Israel Agents | పాలస్తీనా భూభాగమైన వెస్ట్ బ్యాంక్‌లో మంగళవారం ఇజ్రాయెల్ గూఢాచారులు డాక్టర్ల వేషంలో ఓ ఆస్పత్రిలో చొరబడి ముగ్గురు పాలస్తీనా పౌరులను కాల్చి చంపారు.


మీడియా కథనాల ప్రకారం.. వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ నగరంలో ఉన్న ఇబ్న్ సినా ఆస్పత్రి, దాని పక్కనే ఉన్న ఒక శరణార్థి శిబిరంలో నలుగరు వ్యక్తులు ఆస్పత్రి సిబ్బంది యూనిఫాం వేసుకుని వచ్చి కాల్పులు జరిపారు.

ఆస్పత్రిలోని సిసిటీవి దశ్యాలు చూస్తే.. నలుగురు వ్యక్తులు డాక్టర్ల వేషంలో వచ్చారు. ఆ నలుగురిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆ మహిళలు ఒక చంటిపిల్లల తోపుడుబండితో వచ్చి.. ఆస్పత్రిలోని గదులన్నీ వెతుకుతూ ఒక గదిలో వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా ఆ బండిలోనుంచి తుపాకులు బయటకు తీసి గదిలో ఉన్న ముగ్గురు పాలస్తీనా పౌరులపై కాల్పులు జరిపారు. సంఘటన జరిగిన వెంటనే చనిపోయిన వారి చుట్టూ పాలస్తీనా పౌరులు గుమిగూడారు. గత ఎనిమిది సంవత్సరాలలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి.


చనిపోయిన వారిలో ఇద్దరు ఇస్లామిక్ జిహాద్ గ్రూపునకు చెందినవారని స్థానిక మీడియా తెలిపింది.

ఈ ఘటనపై పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పందిస్తూ.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆస్పత్రులకు భద్రత ఉందని.. అయినా ఇజ్రాయెల్ నీచంగా ఆస్పత్రులలో చొరబడి హత్యలు చేస్తోందని మండిపడింది. ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి జెనెరల్ అసెంబ్లీ, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు అత్యవసరంగా స్పందించాలని కోరింది. సంవత్సరాలుగా వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణను అడ్డుకట్ట వేయాలని చెప్పింది.

మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం కూడా ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసింది. చనిపోయిన వారందరూ హమాస్ ఉగ్రవాదులని.. ఆస్పత్రిలో దాగి ఉన్నారని సమాచారం అందడంతో వారిని హతమార్చామని తెలియజేసింది.

Israel Agents, disguise, medical staff, kill, Palestine, West Bank, Jenin city, Hospital, Hamas, Islamic Jihad,

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×