E-Paper
Advertisement

Israel-Hamas War : ఇజ్రాయెల్-హమాస్‌ యుద్ధంలో కీలక పరిణామం.. బంధీల విడుదలకు సంధి

Israel-Hamas War : ఇజ్రాయెల్-హమాస్‌ యుద్ధంలో కీలక పరిణామం.. బంధీల విడుదలకు సంధి
Advertisement

Israel-Hamas War : హమాస్‌ ఉగ్రవాదుల చెరలో ఉన్న దాదాపు 240 మంది బందీల్లో చాలా మందికి విముక్తి లభించనుంది. బంధీలను విడుదల చేయాలంటే కాల్పుల విరమణకు అంగీకరించాలంటూ హమాస్ చేసిన డిమాండ్‌ను ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇజ్రాయెల్‌ కేబినెట్‌ నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. బంధీలను క్షేమంగా విడిపించడానికి ఇజ్రాయెల్, అమెరికా, ఖతార్‌ దేశాలు ప్రయత్నాలు ఫలించాయి.

బంధీలను విడుదల చేయాలంటే ఇజ్రాయెల్‌ సైన్యం తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించాలని, గాజాలోకి పెద్ద ఎత్తున మానవతా సాయాన్ని అనుమతించాలని, ఇజ్రాయెల్‌ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఫైటర్లను విడుదల చేయాలని హమాస్‌ షరతు విధించింది. దీనికి ఇజ్రాయెల్‌ అంగీకరించింది.

Advertisement

రోజుకు 10 నుంచి 13 మంది వరకు బందీలను విడిచి పెట్టేందుకు హమాస్‌ అంగీకరించింది. అయితే కాల్పుల విరమణను పాటించాలని.. ఇజ్రాయెల్‌ జైళ్లల్లో ఉన్న వందలాది ఫైటర్లను విడుదల చేయాలని షరతు విధించింది. అయితే తమ దేశ బంధీల విడుదలపైనే ఫోకస్ చేసిన ఇజ్రాయెల్‌ ఈ షరతులకు అంగీకారం తెలిపింది. మొత్తం 50 మంది వరకు ఇజ్రాయెల్‌ బంధీలు విడుదల కానున్నారు. వీరిలో మహిళలు, చిన్నారులకే అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఇక ఇజ్రాయెల్ జైళ్లల్లో ఉన్న హమాస్ ఫైటర్లు కూడా విడుదల కానున్నారు. మొత్తం 150 మంది వరకు హమాస్‌ ఫైటర్లు విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ముగ్గురు పాలస్తీనియన్‌ ఖైదీలకు చొప్పున బదులుగా ఒక్కో బందీని విడిచిపెడుతుంది హమాస్‌. తమ ఫైటర్లను విడిపించుకోవడానికి బందీలను ఎరగా వాడుకోవాలని హమాస్‌ నిర్ణయించుకుంది. అయితే పూర్తి స్థాయిలో బంధీలను విడిచిపెట్టడం.. హమాస్‌ను అంతం చేయడం.. ఈ రెండు జరిగే వరకు తమ యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తేల్చి చెప్పారు.

Tags

Related News

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

Big Stories

Advertisement
×