E-Paper
Advertisement

Pawan Pracharam : తెలంగాణలో జనసేనాని ప్రచారం.. వరంగల్ కు పవన్

Pawan Pracharam : తెలంగాణలో జనసేనాని ప్రచారం.. వరంగల్ కు పవన్

Pawan Pracharam : తెలంగాణ ఎన్నికల పోరుకు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి మరో వారం రోజులే ఉండటంతో పార్టీలన్నీ క్యాంపెనింగ్స్ లో దూకుడు పెంచాయి. ఈ మేరకు బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బుధవారం నుంచి రెండ్రోజులపాటు ప్రచార హోరులో బిజీ కానున్నారు. ఈ మేరకు బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయసంకల్ప సభకు హాజరుకానున్నారు.

తెలంగాణ కురుక్షేత్రంలో కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా.. అధికారమే టార్గెట్‌ బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. జనసేనతో పొత్తు కుదుర్చుకుని ఎత్తుకు పై ఎత్తు వేస్తోంది. ఇందులో భాగంగానే పవన్‌కల్యాణ్‌ను బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. బుధవారం వరంగల్‌ ఈస్ట్‌ వెస్ట్ ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడి అభ్యర్థులు రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్‌రావులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.

హంటర్‌ రోడ్డులో బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయ సంకల్పం సభకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఇరు పార్టీల శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక సేనాని ప్రచారంతో యువత నుంచి మంచి ఆదరణ వస్తుందని అంచనా వేస్తున్నారు కమలనాథులు. అలాగే రేపు ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట, ఆ తర్వాత దుబ్బాకలో పర్యటించి అక్కడి అభ్యర్థులు తరపున ప్రచారం చేయనున్నారు. ఇక తమ అభ్యర్థులు పోటీ చేస్తున్న తాండూర్‌ అభ్యర్థి శంకర్‌గౌడ్‌, కూకట్‌పల్లి అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ల తరపున ఈ నెల 25, 26వ తేదీల్లో పవన్‌కల్యాణ్‌ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.

.

..

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×