BigTV English

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

ప్రపంచ దేశాలనుంచి అమెరికాకు వచ్చే ఉద్యోగులు ఇకపై H1-B వీసా పొందాలంటే లక్ష డాలర్లు చెల్లించాల్సిందేనంటూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం తీవ్ర విమర్శలపాలవుతోంది. ఇలాంటి టైమ్ లో కూడా కొందరు ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించడం విశేషం. ఆ లిస్ట్ లో ఉన్న కీలక వ్యక్తి నెట్ ఫ్లిక్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్. అయితే గతంలో ఈయనే డొనాల్డ్ ట్రంప్ ని తీవ్రంగా విమర్శించారు. అమెరికా వ్యవస్థలను ఆయన నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పైగా హేస్టింగ్స్ డెమెక్రాట్లకు అతి పెద్ద డోనార్ కూడా అలాంటి ఆయన ట్రంప్ ని సమర్థించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఎందికీ సమర్థింపు..?
వీసా రుసుముని లక్ష డాలర్లుగా ఫిక్స్ చేయడం వల్ల అత్యంత విలువైన ఉద్యోగులను మాత్రమే ఆయా కంపెనీలు అమెరికాకు పిలిపించుకుంటాయని స్పష్టం చేశారు హేస్టింగ్స్. గత 30 ఏళ్లుగా తాను ఈ వీసా నిబంధనలను జాగ్రత్తగా గమనిస్తున్నానని, వీసాతో ముడిపడిన రాజకీయాలను కూడా చూశానని అన్నారాయన. ట్రంప్ నిర్ణయం ఈ వీసా వ్యవహారానికి గొప్ప పరిష్కారం అని తేల్చి చెప్పారు హేస్టింగ్స్. ఇక లాటరీ అవసరం ఉండదని, వీసాపై వచ్చే ఉద్యోగులకు మరింత కచ్చితత్వం ఉంటుందని తెలిపారు. అత్యంత విలువైన ఉద్యోగాలకు మాత్రమే వీసా లభిస్తుందని కూడా అన్నారు.

ఎవరికి నష్టం?
వీసా రుసుముని లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల భారతీయ టాలెంట్ కోసం ఎదురు చూస్తున్న అమెరికా కంపెనీలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగుల్ని పిలిపించుకున్న కంపెనీలకు నష్టం ఉండదు. ఇకపై ఈ పనిచేయాలంటే మాత్రం ఒక్కో ఉద్యోగిపై లక్ష డాలర్లు ఖర్చు పెట్టాల్సిందే. అంత ఖర్చు పెట్టి ఉద్యోగుల్ని అమెరికా పిలిపించుకోవడం కంటే భారత్ నుంచే ఔట్ సోర్సింగ్ పై పనిచేయించుకోవడం బెటర్ అని ఆయా కంపెనీలు భావించే అవకాశముంది. ఇక దిగ్గజ కంపెనీలకు ఇది పెద్ద భారంగా ఉండకపోవచ్చు కానీ, స్టార్టప్ లు, చిన్న చిన్న కంపెనీలు ఈ రుసుముని భరించలేవు.


ట్రంప్ నిర్ణయాన్ని సిలికాన్ వ్యాలీలోని చాలా కంపెనీలు వ్యతిరేకించాయి. అంతకు మించి ఆయా కంపెనీలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, టెస్లా వంటి కంపెనీలు H-1B ఉద్యోగులను అమెరికాలోనే ఉండాలని లేదా ఆదివారం గడువుకు ముందే తిరిగి రావాలని కోరాయి. చివరకు ఆ నిబంధన పాత ఉద్యోగులకు వర్తించదని వైట్ హౌస్ క్లారిటీ ఇవ్వడంతో ఉద్యోగులు కాస్త ఊరట చెందారు. దిగ్గజ కంపెనీలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా, ట్రంప్ విధానాలను బహిరంగంగా విమర్శించలేకపోతున్నాయి. అటు చిన్న చిన్న కంపెనీలు, స్టార్టప్ లు మాత్రం అయోమయంలో పడ్డాయి. ఇలాంటి టైమ్ లో నెట్ ఫ్లిక్స్ వంటి పెద్ద కంపెనీ ట్రంప్ నిర్ణయాన్ని బహిరంగంగా సమర్థించడం మాత్రం విశేషం. మరోవైపు భారత ప్రభుత్వం ఈ నిర్ణయంపై నేరుగా స్పందించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం స్వదేశీ నిబద్ధతను చాటి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. అంటే మేధో వలసకు ఇలాగైనా బ్రేక్ పడుతుందనేది రాజకీయ నాయకుల వాదన.

Related News

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

Big Stories

×