Donald Trump: ఐక్యరాజ్యసమితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్- పాక్ యుద్దాన్నే తానే ఆపానని చెప్పారు. ఏడు నెలల్లో మొత్తం ఏడు యుద్దాలను ఆపినట్టు వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగానే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నా..
ఆయన ప్రసంగంలో భారతదేశానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాకు భారత్, చైనా సహాయం చేస్తున్నాయని ట్రంప్ చెప్పారు. ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు. తాను ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే తనకు అసలైన నోబెల్ బహుమతి అని పేర్కొన్నారు. యుద్ధాలు ఆపడంతో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైందని చెప్పారు.
ఏడు యుద్ధాలలో భారత్ – పాకిస్థాన్ ఒకటి
ఐక్యరాజ్యసమితి తన ప్రాముఖ్యతను కోల్పోయిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను ఆపిన ఏడు యుద్ధాలలో భారత్ – పాకిస్థాన్ ఒకటని అన్నారు. కొన్ని దేశాల మధ్య జరిగిన యుద్ధాలు ఎన్నటికీ ముగియవని చాలా మంది భావించారు.. కొన్ని దేశాల మధ్య 31 ఏళ్లు కొనసాగితే.. మరొకటి 36 ఏళ్లుగా సాగిందని చెప్పారు. అన్ని యుద్ధాలలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
ALSO READ: Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!
అమెరికాకు ఇది స్వర్ణయుగం…
ఇజ్రాయెల్-ఇరాన్, భారత్-పాకిస్థాన్, రువాండా- డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, థాయిలాండ్-కంబోడియా, ఆర్మేనియా-అజర్‌బైజాన్, ఈజిప్టు-ఇథియోపియా, సెర్బియా-కొసావో దేశాల మధ్య యుద్ధాలను తానే ఆపినట్టు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏడాది క్రితం అమెరికా ఇబ్బందుల్లో ఉందని.. తన పాలన నుంచి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందని అన్నారు. తమ దేశానికి ఇదే స్వర్ణయుగమని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశం కూడా తమ దరిదాపుల్లో లేదని అన్నారు.
ALSO READ: DSSSB: పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. కాంపిటేషన్ తక్కువ, దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజే..!