BigTV English

Japanese Baba Vanga Ryo Tatsuki: మహాప్రళయం ముంచుకుస్తోంది.. పవర్ ఫుల్ జపానీస్ బాబా వంగా జోస్యం.. భారత్‌ పైనా ప్రభావం

Japanese Baba Vanga Ryo Tatsuki: మహాప్రళయం ముంచుకుస్తోంది.. పవర్ ఫుల్ జపానీస్ బాబా వంగా జోస్యం.. భారత్‌ పైనా ప్రభావం

Japanese Baba Vanga Ryo Tatsuki| భవిష్యత్తులో జరగబోయే ఘటనల గురించి..రాబోయే వినాశనం గురించి ప్రపంచంలో కొందరు చేసిన భవిష్య వాణి నిజమైంది. అలాంటివారిలో ఫ్రాన్స్ కు చెందిన నోస్ట్రడమస్ అనే జోస్యకారుడు, బల్గేరియాకు చెందిన బాంబా వంగా అనే వృద్ధరాలు చాలా ఫేమస్. వీరు చెప్పినవన్నీ దాదాపు జరిగాయి. ప్రపంచంలో విధ్యంసాలు, ప్రకృతి వైపరీత్యాల గురించి వీరు చాలా సంవత్సరాల ముందే హెచ్చరిస్తూ చెప్పినవి క్రమంగా జరుగుతున్నాయి. జపాన్ లో కూడా రియో తాత్‌సూకీ అనే మహిళ ఆమె బతికి ఉన్నప్పుడు చెప్పినవి ఇప్పుడు జరుగుతున్నాయి. తాజాగా ఆమె 2025లో ఒక భారీ సునామీ రాబోతోందని హెచ్చరించారు. గతంలో ఆమె చెప్పినట్లు 2020లో వైరస్ వస్తుందని చెప్పింది జరిగింది. అయితే ఆ తరువాత ఆ వైరస్ తీవ్ర రూపంలో మళ్లీ తిరిగి వస్తుందని కూడా ఆమె చెప్పారు.


జపాన్ కు చెందని రియో తాత్‌సూకీ భవిష్య వాణి చెప్పే ఒక ప్రవక్తతో పాటు ఒక మాంగా కార్టూన్ ఆర్టిస్ట్ గా కూడా చాలా ఫేమస్. ఆమె తన డైరీలో రాసిన లేఖనాలు చదివితే.. అవి నిజంగా జరిగినట్లు మనకు తెలుస్తుంది. 1995లో ఆమె తన డైరీలో ఈ విధంగా రాశారు. “25 ఏళ్ల తరువాత ఒక వింత వైరస్ వల్ల ప్రపంచంలో ఊహించిన రీతిలో మనుషులు చనిపోతారు. ఆ వైరస్ తాత్కాలికంగా తగ్గిపోతుంది. కానీ పదేళ్ల తరువాత తిరిగి తీవ్ర రూపంలో వస్తుంది.” అని ఉంది. ఈ వ్యాఖ్యానాన్ని 2020లో వచ్చిన కోవిడ్ మహమ్మారితో పోలిక ఉంది. దీంతో ఆమె చెప్పిన జోస్యాలను ప్రజలు సీరియస్‌గా తీసుకుంటున్నారు.

Also Read: చమురు ధరలు తగ్గాయి ఇంకెక్కడి మాంద్యం.. సుంకాలపై వెనక్కుతగ్గని ట్రంప్


అంతకుముందు కూడా ఆమె బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా చనిపోతారని 1992లో చెప్పారు. ఆమె డైరీలో ‘డయానా డైడ్’ అని రాసుకుంది. అచ్చంగా 5 ఏళ్ల తరువాత బ్రిటన్ అందాల యువరాణి డయానా 1997లో ఒక ఘోర కారు ప్రమాదంలో మరణించారు. అలాగే 1991లో బ్రిటన్ ఫేమస్ సింగర్ ఫ్రెడ్డీ మెర్కురీ చనిపోతారని.. ఆయన శృంగార వ్యాధి వల్ల మరణం సంభవిస్తుందని ఆమె రాశారు. అది అచ్చు తప్పకుండా జరిగింది. మళ్లీ 1995లో జపాన్ లోని కోబె ప్రాంతంలో భూకంపం వల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుందని ఆమె చెప్పారు. ఇది కూడా నిజమైంది. 1995లో జపాన్ కోబె ప్రాంతంలో భూకంపం వల్ల 6000 మంది చనిపోగా.. భారీ ఆస్తినష్టం కూడా జరిగింది.

2025లో మహా ప్రళయం రాబోతోంది
రియో తాత్‌సూకీ 2025 సంవత్సరంలో జూలై నెలలో మహా ప్రళయం రాబోతున్నట్లు తన డైరీలో రాసుకున్నారు. ఇప్పుడు ఈ రాతలే ఆమెను నమ్మే వారిని కలవరపెడుతున్నాయి. 2025లో అతిపెద్ద సునామీ రాబోతోంది. 2011లో జపాన్ లో భారీ సునామీ వచ్చింది. ఆ సునామీ కారణంగా జపాన్ తో పాటు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, తైవాన్ దేశాల్లో విధ్వంసం జరిగింది. అప్పుడు వచ్చిన సునామీ కంటే 2025 జూలైలో రాబోయే సునామీ మూడు రెట్లు భారీ వినాశనం జరుగుతుందని ఆమె జోస్యం చెప్పారు. నిజానికి ఆమె చెప్పే సునామీ జపాన్ లో వచ్చినా దాని ప్రభావం ఇండియాపై కూడా ఉంటుంది.

2004 డిసెంబర్ 26న ఇండోనేషియా సమీపంలోని సముద్ర ప్రాంతంలో రేగిన అలజడి, భారీ భూకంపానికి పెద్ద సునామీ వచ్చింది. ఈ కారణంగా భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో సునామీ వచ్చి భయంకరమైన పరిస్థితి ఏర్పాడింది. ఇళ్లు, ఆస్తులు, భవనాలు ధ్వంసమయ్యాయి. గ్రామాలు, పట్టణాలు కొట్టుకుపోయాయి. పెద్ద సంఖ్యలో జనం చనిపోయారు. వందల సంఖ్యలో సునామీలో కొట్టుకుపోయారు.

సునామీ అంటే కేవలం సముద్రం ఉప్పొంగి పడిపోయే అల కాదు. దాని భారీ వినాశనంతో పాటు, జనాలు ఆశ్రయం కోల్పోతారు. రోగాల బారిన పడతారు. గాయాలు, ఇన్‌ఫెక్షన్లు, కలుషిత నీటి వ్యాధులు వంటి సమస్యలు పెద్ద ఎత్తున ఉంటాయి. వీటిని పరిష్కరించడానికి భారీ స్థాయిలో ముందస్తు ఏర్పాట్లు ఉండాలి.

సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎలా డీల్ చేయాలో ప్రజలకు డ్రిల్స్ చేయిస్తూ ఉండాలి. ముఖ్యంగా సముద్ర తీరాల్లో నివసించే వారికి ఇది చాలా అవసరం. అలాంటి పరిస్థితి వస్తే ఎలా తప్పించుకోవాలి. ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి. ప్రభుత్వాలు సునామీ పరిస్థితులను ముందుగానే పసిగట్టి డేంజర్ జోన్లలో ప్రజలకు సైరెన్ లాంటివి ఏర్పాట్లు చేయాలి. వైపరీత్యం తరువాత బాధితులకు అందించేందుకు నీరు, ఆహారం, మెడికల్ కిట్లు, తాత్కాలిక వైద్య సేవల కోసం సంసిద్ధత ఉండాలి.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×